టీడీపీ తీరును వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ వైసీపీ చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి వినూత్న నిరసన చేపట్టారు.
ఇవాళ నామినేషన్ల పరిశీలన. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు మున్సిపాల్టీ కార్యాలయానికి పోరెడ్డి నరసింహారెడ్డితో పాటు వైసీపీ అభ్యర్థులు వెళ్లారు.
తనపై ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి సమక్షంలోనే ఆయన వర్గీయులు భౌతిక దాడికి దిగినట్టు పోరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
తనను కొట్టడంతో పాటు బంగారు చైన్‌ను కూడా లాక్కున్నారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లో చంపేస్తామని ఎమ్మెల్యే వర్గీయులు హెచ్చరించినట్టు ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
టీడీపీ నేతల దాడిని నిరసిస్తూ, పోరెడ్డితో పాటు వైసీపీ అభ్యర్థులంతా బయటికి వచ్చారు.
అప్పటికే మున్సిపల్ కార్యాలయం వెలుపల వందలాది మందితో ఉన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డితో కలిసి పోరెడ్డి నరసింహారెడ్డి అర్ధ నగ్న ప్రదర్శన చేపట్టారు.
పట్టణంలో ర్యాలీగా వెళుతూ, పట్టణంలో ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి, ఆయన కుటుంబ సభ్యులే పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని వీధుల్లో ప్రచారం చేస్తూ ఆయన ముందుకెళ్లారు.
వరదరాజులరెడ్డి కుటుంబం రానున్న రోజుల్లో పట్టణంలో ఏ ఒక్కరూ వ్యాపారాలు చేసుకోకుండా చేస్తుందని హెచ్చరించారు.
అలాగే మహిళల మానప్రాణాలకు వరదరాజులరెడ్డి ఏలుబడిలో రక్షణ ఉండదని పోరెడ్డి నరసింహారెడ్డి పెద్ద ఎత్తున పట్టణంలో ప్రచారం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.
ముఖ్యంగా పట్టణంలో ఆర్యవైశ్యులు రానున్న రోజుల్లో వరదరాజులరెడ్డి కుటుంబ సభ్యుల అవినీతి, దోపిడీ కారణంగా బంగారు వ్యాపారాలు చేసుకోలేరంటూ ఆయన హెచ్చరించడం చర్చనీయాంశమైంది.

తెలుగు దండు పాళ్యం
అన్న ఈ మధ్య సప్త సముద్రాల మధ్య ఉన్న పట్టుకొని బట్టలు ఊడదీస్త అంటే ఏంటి ఏమిటో అనుకున్నా…
శాంపిల్ ప్రొద్దుటూరు లో.జరిగిందని
“తప్పుడు ల0జే” కొట్టారంటూ డ్రామాలు బానే ఆడుతోంది..!
బాగా పోరాడుతున్నావ్ జార్జిరెడ్డా! ఏరెడ్డికి బిడ్డవోగాని నీబాధ వర్ణానాతీతమబ్బీ
ప్రతి ఆర్టికల్లోకివచ్చి ఓరెండుమూడు కామెంట్లన్నాఏసి దుడ్లుపోగేసుకుంటూ నీపేరుకు ఆతోక ఇచ్చినోల్ల మీద అటు పగకిపగ ఇటు చిల్లరకుచిల్లర.. బాగుందబ్బీ నీయాపారం – పాపం ఏరెడ్డి బిడ్డవోగాని!
బాగా పోరాడుతున్నావబ్బీ జార్జిరెడ్డా! ఏరెడ్డికి బిడ్డవోగాని నీబాధ వర్ణానాతీతమబ్బీ
ప్రతి ఆర్టికల్లోకివచ్చి ఓరెండుమూడు చిల్లర కామెంట్లన్నాఏసి దుడ్లుపోగేసుకుంటూ నీపేరుకు ఆతోక ఇచ్చినోల్ల మీద అటు పగకిపగ ఇటు చిల్లరకుచిల్లర.. బాగుందబ్బీ నీయాపారం – పాపం ఏరెడ్డి బిడ్డవోగాని!
kindadhi kooda ippi tiragamanu ..inkaa vinoothnam gaa vuntadhi.
Baga interested ga unnav
దీనిని నిరసన అనరు, మానసిక వికారం అంటారు.