వైసీపీ రియాక్ష‌న్ నినాదం.. లాభ‌మా? న‌ష్ట‌మా?

అధికారంలోకి వ‌స్తే, అధికారులు, కూట‌మి నేత‌ల అంతు చూస్తామ‌ని మాత్రం ప‌దేప‌దే వైసీపీ సీనియ‌ర్ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు.

“మేము అధికారంలోకి వ‌స్తే రియాక్ష‌న్ తీవ్రంగా వుంటుంది. మీరు త‌ట్టుకోలేరు” అని వైసీపీ సీనియ‌ర్ నేత‌లు త‌ర‌చూ కూట‌మి నాయ‌కులు, అధికారుల్ని హెచ్చ‌రిస్తున్నారు.

వైసీపీ నేత‌ల‌పై అక్ర‌మ కేసులు న‌మోదు చేయ‌డం, వాళ్ల‌ను జైళ్ల‌కు పంప‌డం ఇంకా కొన‌సాగుతోంది. రెడ్‌బుక్ పాల‌న‌లో భాగంగానే వేధింపులు కొన‌సాగుతున్నాయ‌నేది వైసీపీ ప్ర‌ధాన ఆరోప‌ణ‌.

ఈ ఆరోప‌ణ‌ను ఎవ‌రూ కొట్టి పారేయ‌లేని ప‌రిస్థితి. ఇదే సంద‌ర్భంలో ప్ర‌తీకార రాజ‌కీయాల గురించే ప‌దేప‌దే మాట్లాడ్డం వైసీపీకి రాజ‌కీయంగా లాభ‌మా? న‌ష్ట‌మా? అనే విష‌య‌మై ఆ పార్టీ ముఖ్య నాయ‌కులు ఆలోచించుకోవాలి. మంచి ప‌రిపాల‌న అందివ్వాల‌ని ప్ర‌జ‌లు కోరుకుంటారు. అందుకోస‌మో అధికారాన్ని క‌ట్ట‌బెడుతుంటారు.

అయితే ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు ఎప్పుడూ నెర‌వేర‌డం లేదు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాత్రం ఏవేవో చేస్తామ‌ని రాజ‌కీయ పార్టీల అధినేత‌లు హామీలిస్తుంటారు. అధికారం వ‌చ్చే వ‌ర‌కే అవ‌న్నీ గుర్తుంటాయి.

ఒక్క‌సారి అధికారంలోకి వ‌చ్చాక, హామీల్ని మ‌రిచిపోవ‌డం రాజ‌కీయ నాయ‌కుల‌కు అల‌వాటైంది. ప్ర‌జ‌ల్లో అసంతృప్తి, ఆగ్ర‌హం .. ఐదేళ్ల పాల‌న‌లో క‌నిపిస్తుంటాయి. దీంతో మ‌ళ్లీ మ‌రో పార్టీ వైపు మొగ్గు చూపుతుంటారు. ఇదే తంతు సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో వైసీపీ మ‌రోసారి అధికారంలోకి వ‌స్తామ‌ని చెబుతోంది. అయితే అధికారంలోకి రావ‌డమే ఇప్పుడు ఆ పార్టీ నేత‌ల ఎదుట ఉన్న అతిపెద్ద స‌వాల్‌.

తాము అధికారంలోకి వ‌స్తే, రాష్ట్రాభివృద్ధికి ప‌లానా మంచి ప‌నులు చేస్తామ‌ని చెప్ప‌డంలో వైసీపీ విఫ‌ల‌మ‌వుతోంది. ఇంకా ఎన్నిక‌ల‌కు రెండున్నరేళ్ల స‌మ‌యం వుండ‌డంతో మ్యానిఫెస్టో గురించి మాట్లాడ్డం లేద‌ని ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

కానీ అధికారంలోకి వ‌స్తే, అధికారులు, కూట‌మి నేత‌ల అంతు చూస్తామ‌ని మాత్రం ప‌దేప‌దే వైసీపీ సీనియ‌ర్ నేత‌లు హెచ్చ‌రిస్తున్నారు. ఒక పార్టీ ప్ర‌తీకార రాజ‌కీయాల కోసం అధికారం ఎందుకు ఇవ్వాల‌నే ప్ర‌శ్న‌కు వైసీపీ నేత‌లు స‌మాధానం చెప్పాలి.

వైసీపీ నేత‌ల ప్ర‌తీకార ప్ర‌క‌ట‌న‌ల‌పై ముఖ్యంగా త‌ట‌స్థులు, విద్యావంతులు, మేధావుల్లో అసంతృప్తి క‌నిపిస్తోంది. ఇప్పుడు టీడీపీ మాదిరిగానే, రేపు వైసీపీ అధికారంలోకి వ‌స్తే క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌కు పాల్ప‌డుతుంద‌ని కొన్ని వ‌ర్గాలు మాట్లాడుకుంటున్నాయి.

రాజ‌కీయంగా త‌మ వాళ్ల‌లో మ‌నోధైర్యం క‌ల్పించ‌డానికి ప్ర‌తీకార హెచ్చ‌రిక‌లు ప‌నికొస్తాయ‌ని వైసీపీ ముఖ్య నేత‌లు భావిస్తూ వుండొచ్చు. అయితే నిత్యం ప్రతీకార నామ‌స్మ‌ర‌ణ చేయాల్సిన ప‌నిలేదు.

రాజ‌కీయాల్లో అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల ఆద‌ర‌ణ చూర‌గొంటేనే అధికారం ద‌క్కుతుంది. ఆ విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు. ముఖ్యంగా ఎలాగైనా అధికారంలోకి రావాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్న వైసీపీ విస్మ‌రించ‌డం, ఆ పార్టీకి మంచిది కాదు.

ఇక నుంచైనా ప్ర‌తీకార ప్ర‌క‌ట‌న‌లు కాకుండా, ప్ర‌గ‌తికి సంబంధించి ఎంత ఎక్కువ‌గా మాట్లాడితే అంత మంచిద‌ని ఆ పార్టీ పెద్దలు తెలుసుకోవాలి.

12 Replies to “వైసీపీ రియాక్ష‌న్ నినాదం.. లాభ‌మా? న‌ష్ట‌మా?”

  1. ఎందిరా అరికట్లా, ఏంటీ తప్పుడు మాటలు..  మనం మానిఫెస్టో అమలుచెయ్యలేదా?

    చెప్పిన ప్రతీహామీ మడమ తిప్పకుండా, మాట తప్పకుండా ఈ ప్రపంచం లో ఎవ్వరూ చేయనివిధంగా

    నవరత్తాలు98% అమలు చేసి పారేసి, 10లచ్చల్ కోట్లు అప్పు దెంకొచ్చి మరీ, బటన్ నొక్కి పంచేశాం.. ఆంధ్రాలో  పేదలే లేకుండా చేసి మన విశ్వసనీయత నిరూపించుకున్నాం..

    ఐనా కానీ ఈ ప్రజలు మనోడికంటే చంద్రబాబే బెటర్ అంటూ, A 1కొజ్జాగాడు కనీసం ప్రతిపక్ష  నాయకుడిగా కూడా పనికిమాలిన సన్నాసి అని11 ఇంచులు దె0గీ, పక్క రాష్ట్రానికి పరిగెత్తించారు.. ఎందుకు అరికట్లా?

  2. ఫ్యాక్షన్ బ్యాచ్ రాజకీయల్లోకి వచ్చినంత మాత్రాన భాష, నడవడిక ఎక్కడికి పోతాయి?! ఆలోచనలెప్పుడూ పగ, ప్రతీకారాల చుట్టూనే తిరుగుతుంటాయి. పరిపాలన, అభివృద్ధి వంటి బూతు మాటలు తలకెక్కడం కష్టం!

  3. అరికట్లా నీకేమీ తెలియదు ఊరుకో..

    మళ్ళీ మేమే, అధికారం మాదే, మేమొచ్చిన తర్వాత

    అధికారుల అంతు చూస్తాం,

    పోలీసుల బట్టలూడదీస్తాం ,

    షర్ట్ మడతేసి రండి చూసుకుందాం.. 

    ప్రజల్ని రప్పా రప్పా నరుకుతాం అనే మాట రాష్ట్రం మొత్తం resound వస్తేనే,

    మనోళ్లకి కసి, పౌరుషం  &ఎమోషన్ ఎక్కేది.. 

    ఎమోషన్ ఎక్కితేనే.. మనోడికి ప్రమోషన్ వచ్చేది.

  4. ఏంట్రా అరికట్లా నువ్వు.. మరీ సింపుల్ లాజిక్ కూడా తెలియని సన్నాసివి అనుకోలేదు..

    నష్టం అంటే అరకొరగా మిగిలిన నిఖార్సైన కార్యకర్తలు కూడా మత్తులోకి జారిపోతారు..  so మనోళ్లకి ఊపు రావాలంటే 11రెట్లు లాభం అని ప్రచారం చెయ్యాలి.

  5. “ఏంట్రా అరికట్లా నువ్వు.. మరీ సింపుల్ లాజిక్ కూడా తెలియని సన్నాసివి అనుకోలేదు..

    నష్టం అంటే అరకొరగా మిగిలిన నిఖార్సైన కార్యకర్తలు కూడా మత్తులోకి జారిపోతారు.. so మనోళ్లకి ఊపు రావాలంటే 11రెట్లు లాభం అని ప్రచారం చెయ్యాలి.

Comments are closed.