Advertisement

Advertisement


Home > Politics - Andhra

డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఓకేనా రామోజీ!

డీజీపీగా ద్వార‌కా తిరుమ‌ల‌రావు ఓకేనా రామోజీ!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాలు ముందుగా చంద్ర‌బాబునాయుడు రాజ‌గురువుకు న‌చ్చాలి. ఆయ‌న‌కు న‌చ్చ‌లేదంటే త‌న ప‌త్రిక‌లో విద్వేష రాత‌లు రాయ‌డానికి కాచుక్కూచుని వుంటారు. గ‌త నెల‌లో ప‌లువురు ఐఏఎస్‌, ఐపీఎస్ అధికారుల్ని ఈసీ మార్చేసింది. కొత్త వారిని నియ‌మించింది. అబ్బే... ఈ నియామ‌కాలు రాజ‌గురువుకు అస‌లు న‌చ్చ‌లేదు. జ‌గ‌న్ తొత్తుల్ని నియ‌మించారంటూ ఎల్లో ప‌త్రిక శివాలెత్తి రాసింది.

తాజాగా ఏపీ డీజీపీ కేవీ రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని బ‌దిలీ చేశారు. కొత్త పోలీస్ బాస్ ఎవ‌ర‌నే అంశం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నూత‌న డీజీపీగా ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమ‌ల‌రావు పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తోంది. 1990వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి. సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్నారు. అయితే రాష్ట్ర ప్ర‌భుత్వం పంపే ప్యాన‌ల్ లిస్ట్ నుంచి ఎవ‌రిని డీజీపీగా ఎంచుకోవాల‌నేది ఎన్నిక‌ల సంఘం ఇష్టం. అంత‌కు ముందు బాబు రాజ‌గురువు నుంచి ఆమోదం ల‌భించాల్సి వుంటుంది.

ఆయ‌న గారికి న‌చ్చ‌క‌పోతే, జ‌గ‌న్‌తో సాన్నిహిత్యాన్ని అంట‌గ‌ట్టి అడ్డుకునేందుకు య‌త్నించడం వెన్న‌తో పెట్టిన విద్య‌. కానీ ద్వార‌కా తిరుమ‌ల‌రావు వివాద ర‌హితుడిగా పేరు పొందారు. అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన అధికారి అయిన తిరుమ‌ల‌రావునే డీజీపీగా నియ‌మించే అవ‌కాశాలు మెండుగా ఉన్నాయి.

అయితే గ‌తంలో కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి రాసిన లేఖ‌లో రాజేంద్ర‌నాథ్‌రెడ్డిని త‌ప్పించి, ద్వారకా తిరుమ‌ల‌రావును నియ‌మించాల‌ని సూచించారు. ఈ సూచ‌న ఏమైనా ఆయ‌న నియామ‌కానికి అడ్డంకిగా మారే అవ‌కాశాల‌ను కొట్టి పారేయ‌లేమ‌ని ప‌లువురు అంటున్నారు. మ‌రో వారంలో ఎన్నిక‌లుండ‌గా, ఏపీకి కొత్త పోలీస్ బాస్ రానుండ‌డం విశేషం. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?