స్టాలిన్‌ను ఓడిస్తానంటున్న అప్స‌రా

త‌మిళ‌నాడు  అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో అన్నాడిఎంకే పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నిక‌ల్లో డీఎంకే విజ‌య‌ఢంకా మోగిస్తుంద‌ని ప‌లు స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్…

త‌మిళ‌నాడు  అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. ప్ర‌స్తుతం ఆ రాష్ట్రంలో అన్నాడిఎంకే పార్టీ అధికారంలో ఉంది. ఈ ఎన్నిక‌ల్లో డీఎంకే విజ‌య‌ఢంకా మోగిస్తుంద‌ని ప‌లు స‌ర్వే ఫ‌లితాలు వెల్ల‌డిస్తున్నాయి. డీఎంకే అధినేత స్టాలిన్ సీఎం కావ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.  కొళ‌త్తూరు నియోజ‌క వ‌ర్గం నుంచి స్టాలిన్ బ‌రిలో నిలుస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో స్టాలిన్ ఓడించి తీరుతాన‌ని హిజ్రా అప్స‌రారెడ్డి శ‌ప‌థం చేశారు. అన్నాడీఎంకే ప్ర‌చార క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న అప్స‌రారెడ్డి  ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో చురుగ్గా పాల్గొంటున్నారు. 

అన్నాడీఎంకే అభ్యర్థిగా కొళత్తూరు నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆమె పార్టీకి దరఖాస్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా అప్సరారెడ్డి మాట్లాడుతూ మీడియాతో మాట్లాడుతూ  అధిష్ఠానం ఆదేశిస్తే కొళత్తూరు నియోజకవర్గంలో స్టాలిన్‌పై పోటీ చేయ‌డ‌మే కాదు, ఓడిస్తానని దృఢంగా చెప్పారు. 

స్టాలిన్ ఉద్దేశ పూర్వ‌కంగా అన్నాడీఎంకే ప్రభుత్వంపైనా, ముఖ్యమంత్రి ఎడప్పాడిపైనా అన‌వ‌స‌ర విమర్శలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. తన లాంటి హిజ్రాల కోసం అన్నాడీఎంకే ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. 

మీరు మారిపోయారు సార్‌

త‌ప్పు క‌దా..?