అంతా కొత్తగా ఉంది అంటున్న కళా..?

అవును మరి టీడీపీకి  అధికారం శాశ్వతం అనుకున్నాక ఘోరంగా ఓడిపోవడమే ఒక షాకింగ్ అనుభవం. ఏపీలో ఎప్పటికీ సీఎం కాడు అని ఘాటైన  జోస్యాలు చెప్పాక కూడా కుర్చీ ఎక్కి  జగన్ రెండేళ్ల పాలనకు…

అవును మరి టీడీపీకి  అధికారం శాశ్వతం అనుకున్నాక ఘోరంగా ఓడిపోవడమే ఒక షాకింగ్ అనుభవం. ఏపీలో ఎప్పటికీ సీఎం కాడు అని ఘాటైన  జోస్యాలు చెప్పాక కూడా కుర్చీ ఎక్కి  జగన్ రెండేళ్ల పాలనకు దగ్గరలో ఉండడం కూడా తమ్ముళ్ళకు  కొత్తగానే ఉంది.

సరే ఇవన్నీ మాజీ మంత్రి, నిన్నటిదాకా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ గా పనిచేసిన కళా వెంకటరావుకు కొత్తగా ఉండడంతో విశేషం లేదు కానీ. అక్రమ‌ ఆరెస్టులు, అరాచక పాలన అని జగన్ మీద విరుచుకుపడుతున్నారు. తన రాజకీయ జీవితంలో ఇలాంటి పాలనను ఎపుడూ చూడలేదని అంటున్నారు. అదే అసలైన విడ్డూరం మరి.

విమానాశ్రయాల్లో అరెస్టులు ఇంతకు ముందు జరగలేదా. కళా వాటిని చూడలేదా. 2018లో విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ తదితరులను నాటి బాబు సర్కార్ అరెస్ట్ చేసినపుడు మంత్రిగా ఉన్న కళాకు అది అక్రమం అనిపించలేదా అని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారు అంటే సబబే కదా.

ప్రశ్నిస్తే జైలు పాలు చేస్తున్నారుట. జగన్ మీద విమర్శ చేస్తే కేసులు పెడుతున్నారుట. ఇదంతా తాను చూడని పాలన అని కళా వారు వాపోతున్నారు. గత అయిదేళ్లలో చంద్రబాబు జమానాను ఒక్కసారి చూస్తే అన్నీ అర్ధమవుతాయని వైసీపీ నేతలు దీనికి పదునైన బదులే ఇస్తున్నారు. ఇక స్థానిక ఎన్నికలను భ్రష్టు పట్టించారు అని మాజీ మంత్రి అంటున్నారు. 

ఎన్నికల సంఘం ఓ వైపు అంతా బాగా సజావుగా సాగిందని చెబుతూంటే మధ్యలో ఈ విమర్శలు ఎందుకో . ఏది ఏమైనా టీడీపీ బాధ ఓటమి బాధ. దాన్ని జనం బాధగా మార్చుతోందని  వైసీపీ నుంచి గట్టిగానే సెటైర్లు పడుతున్నాయి మరి.

మీరు మారిపోయారు సార్‌ 

త‌ప్పు క‌దా..?