శేఖర్ కమ్ముల-నాగ్ చైతన్య-సాయిపల్లవిల కాంబినేషన్ లో లవ్ స్టోరీ సినిమా రెడీ అవుతోంది.ఇప్పటికి మూడు పాటలు బయటకు వచ్చాయి. నీ చిత్రం చూసి అనే పాట ఇప్పటికే డీసెంట్ హిట్ అయింది.
సారంగ దరియా పాట పెద్ద హిట్ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. ఆ దిశగానే నడుస్తోంది కూడా. సారంగ దరియా పాట బయటకు రాగానే లవ్ స్టోరీ అట్రాక్షన్ మొత్తం సాయి పల్లవి అయిపోయింది. సినిమాలో హీరో ఎవరు అన్న పాయింట్ నే పక్కకు పోయినట్లు కనిపిస్తోంది.
ఇదిలా వుంటే సాధారణంగా శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్లు డామినేట్ చేస్తారు. హీరోలు డల్ అయిపోతారు. కానీ ఆ విషయంలో ఫిదా కాస్త నయం. కానీ ఇప్పుడు లవ్ స్టోరీ సినిమా విషయానికి వస్తే మళ్లీ సాయి పల్లవే డామినేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. సినిమా కథ కూడా ఆ రీతిగానే వుంటుందని తెలుస్తోంది.
సాధారణంగా చైతూ సినిమాల మంచి చెడ్డలు సమంత చూస్తారు. గతంలో కొన్ని సినిమాలకు సమంత మార్పులు చేర్పులు చేసినట్లు గ్యాసిప్ లు వున్నాయి. మరి అలాంటిది ఇప్పుడు పూర్తిగా సాయిపల్లవిని హైలైట్ చేస్తూ లవ్ స్టోరీ తయారయితే సమంత ఏం చేస్తారో చూడాలి?