వకీల్ సాబ్ నాన్ థియేటర్ 31 కోట్లు

రాబోయే పెద్ద సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమేక్. ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు (డిజిటల్ స్ట్రీమింగ్-శాటిలైట్) కలిపి 31 కోట్లకు విక్రయించారు. శాటిటైట్ హక్కులను జీ టీవీ…

రాబోయే పెద్ద సినిమాల్లో వకీల్ సాబ్ ఒకటి. పవన్ కళ్యాణ్ చేస్తున్న రీమేక్. ఈ సినిమా నాన్ థియేటర్ హక్కులు (డిజిటల్ స్ట్రీమింగ్-శాటిలైట్) కలిపి 31 కోట్లకు విక్రయించారు. శాటిటైట్ హక్కులను జీ టీవీ తీసుకుంది. 

ఇంకా హిందీ డబ్బింగ్ హక్కులు వున్నాయి. అయితే పింక్ సినిమాకు రీమేక్ కావడంతో హిందీ డబ్బింగ్ కు ఏ మేరకు వస్తాయి అన్నది తెలియాల్సి వుంది.

ఇదిలా వుంటే పవన్ కళ్యాణ్-క్రిష్ సినిమా ఓవర్ సీస్ మార్కెట్ బిజినెస్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. ఆర్ఆర్ఆర్, ఆచార్య హక్కులు తీసుకున్న దుబాయ్ ఫారస్ సంస్థే ఈ హక్కులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. రేటు ఇంకా తెలియాల్సి వుంది. 15 కోట్లు అని ప్రఛారంలో వుంది కానీ అది నిజం కాదని బోగట్టా.

అలాగే పవన్-రానా ఓవర్ సీస్ లేదా నాన్ థియేటర్ డీల్ కూడా క్లోజ్ కాలేదు. అమెరికా పరిస్థితి మెరుగుపడేదాకా వెయిట్ చేయాలని నిర్మాత ఆలోచిస్తున్నారు. శాటిటైట్, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు మాత్రం జీ టీవీ తో బేరాలు సాగుతున్నాయి.

త‌ప్పు క‌దా..?

మీరు మారిపోయారు సార్‌