టీడీపీకి నిద్రలేకుండా చేస్తున్న జగన్!

చదువుకున్న యువతరాన్ని సోమరిపోతుల్లా తయారు చేసే నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడి ఆలోచన. ఊరికే ఇంటిదగ్గర కూర్చుంటే వెయ్యి రూపాయలు చొప్పున రెండు మూడు నెలలు, రెండు వేల రూపాయల చొప్పున రెండు నెలలు…

చదువుకున్న యువతరాన్ని సోమరిపోతుల్లా తయారు చేసే నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడి ఆలోచన. ఊరికే ఇంటిదగ్గర కూర్చుంటే వెయ్యి రూపాయలు చొప్పున రెండు మూడు నెలలు, రెండు వేల రూపాయల చొప్పున రెండు నెలలు వారి చేతిలో పెట్టించారు చంద్రబాబు నాయుడు. నిరుద్యోగభృతి అనేది ఎంత నికృష్టమైన ప్రోగ్రామో కాస్త ఆలోచన ఉన్న వారెవరికి అయినా తెలుస్తుంది.

జగన్ రాగానే అలా ఊరికే చిల్లర డబ్బులు  ఇచ్చి, యువతరాన్ని సోమరి  పోతులుగా తయారు చేసే ప్రోగ్రామ్ రద్దు అయ్యింది. యువతకు కావాల్సింది నిరుద్యోగ భృతి కాదు, చేయడానికి పని. ఆ దిశగా సాగుతున్నారు జగన్.  ఇప్పటికే గ్రామాల్లో వలంటీర్ల నియామకాలు పూర్తయ్యాయి. వారికి గౌరవవేతనంగా ఐదారు వేల రూపాయలు, చేయడానికి పని దొరికింది. 

ఇక మరోవైపు విలేజ్ సెక్రటేరియట్ జాబుల కోసం భారీ నోటిఫికేషన్ వేశారు. మరో నెలన్నరలో అందుకు సంబంధించి ముప్పై మూడు వేల జాబులు భర్తీ కాబోతున్నాయి. అవి పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగాలు. వాటి కోసం ఉద్యోగార్థులు  గట్టిగా శ్రమిస్తున్నారు. 

ఇలా యువతను ఉద్యోగాలను సంపాదించుకోవడంలో బిజీగా మార్చారు జగన్. అది కూడా అందరి కలల పంట అయిన ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్కసారిగా ముప్పై వేలకు పైగా అందుబాటులోకి రావడంతో ఇప్పటికే ఆ తరహా ప్రిపరేషన్ లో ఉన్న వారిలో కొత్త ఉత్సాహం వచ్చింది. 

ఈ విషయాల గురించి ఇటీవల టీడీపీ పొలిట్ బ్యూరోలో చర్చించుకున్నారట. యువతను జగన్ ఉద్యోగాలతో బిజీ గా చేస్తున్నారని, తాము చేయని పనిని జగన్ చేస్తుండటంతో తెలుగుదేశం పార్టీ వారిలోనే ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే.. మాటలు కోటలు దాటుతూ ఉంటాయి కానీ, నామమాత్రంగా కూడా నోటిఫికేషన్లు ఉండవు. చంద్రబాబు అధికారంలో ఉండే ఏపీపీఎస్సీకి పనే ఉండదు.

జగన్ మాత్రం ఇప్పుడు ఏపీపీఎస్సీకి కూడా మరో పని అప్పగిస్తున్నారట. త్వరలోనే మరిన్ని ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ అని భారీ స్థాయిలో నోటిఫికేషన్లు, రెండు లక్షలకు పైగా భర్తీ.. అని సీఎం జగన్ స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రకటించారు. ఇప్పటికే ఉన్న నోటిఫికేషన్లకు తోడు త్వరలో మరిన్ని  నోటిఫికేషన్లు రాబోతున్నాయని జగన్ ప్రకటిస్తుండటం తెలుగుదేశం పార్టీని కలవర పెట్టే ప్రకటనే. యువత అలా ఉద్యోగాల వేటలో నిమగ్నం అయితే ప్రతిపక్ష పార్టీకి పని లేకుండా పోతుంది.