Advertisement

Advertisement


Home > Politics - National

స్కూల్ నుంచి కొరియాకి.. స్కూల్ పిల్లల ఫాంటసీ

స్కూల్ నుంచి కొరియాకి.. స్కూల్ పిల్లల ఫాంటసీ

తమ అభిమాన హీరోలు, హీరోయిన్లను కలుసుకునేందుకు టీనేజ్ పిల్లలు చేసే సాహసాలు గతంలో చాలానే చూశాం. ఇది కూడా అలాంటిదే. ఈసారి ముగ్గురు అమ్మాయిలు ఏకంగా చెన్నై నుంచి కొరియాకు వెళ్లాలని స్కెచ్ వేశారు.

తమిళనాడులోని కరూర్ జిల్లాలోని ఓ గ్రామానికి ముగ్గురు అమ్మాయిలు ఒకే స్కూల్ లో 8వ తరగతి చదువుకుంటున్నారు. వీళ్ల ముగ్గురికీ సౌత్ కొరియాకు చెందిన బీటీఎస్ బ్యాండ్ అంటే చాలా ఇష్టం. నిత్యం వాళ్ల పాటలు వింటుంటారు. ఎలాగైనా దక్షిణకొరియా వెళ్లి వాళ్లను కలవాలని నిర్ణయించున్నారు

అనుకున్నదే తడవుగా ముగ్గురూ కలిసి స్కెచ్ వేసుకున్నారు. తూత్తుకుడి కంటే విశాఖ షిప్ యార్డ్ నుంచి ఈజీగా దక్షిణకొరియా వెళ్లొచ్చని తెలుసుకున్నారు. ముగ్గురూ కలిసి 14వేల రూపాయలతో తమ ఇళ్ల నుంచి బయల్దేరారు.

ముందుగా చెన్నై చేరుకున్నారు. ఎలాగోలా ఓ హోటల్ రూమ్ తీసుకొని అందులో దిగారు. అక్కడ్నుంచి విశాఖ వెళ్లాలనే ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో తిరిగి ఇంటికెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. కాట్పాడి రైల్వే స్టేషన్ లో అర్థరాత్రి ఆహారం కోసం దిగి ట్రయిన్ మిస్సయ్యారు.

ఈలోగా పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు చురుగ్గా వ్యవహరించి అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించడంతో, పిల్లల ఆచూకి లభ్యమైంది. కొరియా వెళ్లాలంటే పాస్ పోర్టు, వీసాలు కావాలనే కనీస అవగాహన కూడా లేకుండా ఈ ముగ్గురు పిల్లలు బయల్దేరారు. పిల్లలందరికీ కౌన్సిలింగ్ ఇప్పించి, వాళ్ల ఇళ్లకు చేర్చారు పోలీసులు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?