ఏఐ చిప్ ల తయారీ దిగ్గజం ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. చైనా గూఢచారిగా అనుమానిస్తున్న అలిస్ లే హువాంగ్ అనే మహిళతో ఆయనకు వివాహేతర సంబంధం ఉందన్న ఆరోపణలు పెను సంచలనం సృష్టించాయి.
ఈ విషయాన్ని జెన్సన్ హువాంగ్ కూడా అంగీకరించారు. ఇదివరకే బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఇప్పుడు ఏకంగా తన పదవికి రాజీనామా చేశారు.
సుదీర్ఘంగా సమావేశమైన ఎన్విడియా బోర్డు, హువాంగ్ రాజీనామాను ఆమోదించింది. ఆయన స్థానంలో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కోలెట్ క్రెస్‌ను తాత్కాలిక సీఈవోగా నియమించింది.
సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న ‘మెగాస్పీడ్’ అనే షెల్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న అలిస్… జెన్సన్ హువాంగ్ కు దగ్గరయ్యారు. హువాంగ్ ను వలలో వేసుకున్న అలిస్.. తన మెగాస్పీడ్ కంపెనీకి ఎన్విడియా చిప్ లను దిగుమతి చేసుకొని, వాటిని చైనాకు సరఫరా చేసినట్టు అమెరికా అనుమానిస్తోంది.
అలిస్‌కు చైనా నిఘా సంస్థలతో సంబంధాలు ఉన్నాయని అమెరికా నిఘా వర్గాలు దాదాపు తేల్చేశాయి. అటు చైనా మాత్రం ఈ ఆరోపణలను ఖండించింది. దీనిపై అమెరికా దర్యాప్తు మొదలుపెట్టింది. అటు ఎన్విడియాలో కూడా అంతర్గత దర్యాప్తు మొదలైంది. ఇలాంటి టైమ్ లో హువాంగ్ రాజీనామా చేయడం సంచలనంగా మారింది.
హువాంగ్ నిజాయితీపరుడని ట్రంప్ వెనకేసుకొచ్చినప్పటికీ, అమెరికా ప్రతినిధుల సభలోని విదేశీ వ్యవహారాల కమిటీ ఆయనను విచారణకు పిలిచింది. జనవరి నుంచి అమెరికా కాంగ్రెస్ లో డెమొక్రాట్ల పట్టు పెరగనున్న నేపథ్యంలో, హువాంగ్ పై మరింత లోతుగా విచారణ జరిగే అవకాశం ఉంది.
అమెరికాకు ఎన్విడియా అత్యంత కీలకం. ఇది తయారుచేసే చిప్ లపైనే అమెరికా దిగ్గజ కంపెనీలు నడుస్తున్నాయి. పైగా అమెరికా రక్షణ విభాగంలో ఎన్విడియా చిప్ లతో పనిచేసే ఏఐ టూల్స్ ను వాడాలని ట్రంప్ ఇదివరకే నిర్ణయించారు. ఇలాంటి టైమ్ లో ఆ చిప్ లు చైనా చేతికి వెళ్లాయని నిఘా వర్గాలు తేల్చడంతో ట్రంప్ ఇరకాటంలో పడ్డారు.
పైగా చైనాతో జరుగుతున్న ఏఐ యుద్ధంలో డ్రాగన్ దేశాన్ని కట్టడి చేయాలంటే, ఎన్విడియాను వెనకేసుకురావాల్సిన పరిస్థితి. చైనాకు చిప్ లు సరఫరా చేయకుండా అమెరికా ఇప్పటికే నిషేధం విధించింది.
అన్నింటికీ మించి ఎన్విడియా అనేది అతిపెద్ద కంపెనీ. ఈ కంపెనీ ఆస్తుల విలువ అక్షరాలా 382 లక్షల కోట్ల రూపాయలు. ఈ డబ్బుతో మెటా లాంటి 2 కంపెనీల్ని కొనుగోలు చేయొచ్చు. బ్రిటన్ దేశాన్ని రెండేళ్ల పాటు నడపడానికి అయ్యే ఖర్చు కంటే ఎన్విడియా మార్కెట్ విలువ ఎక్కువ. ఇంత పెద్ద కంపెనీపై సహజంగానే ట్రంప్ కు ప్రేమ ఉంటుంది కదా.
కానీ హువాంగ్ ను ట్రంప్ కాపాడలేకపోయారు. తప్పనిసరి పరిస్థితుల మధ్య జెన్సన్ హువాంగ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి.
మార్కెట్లు ఓపెన్ అయిన కాసేపటికే 700 బిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. గత నెలలో 243.37 డాలర్ల గరిష్ట స్థాయిలో ఉన్న ఎన్విడియా షేరు ధర, రాజీనామా వార్తలతో దాదాపు 35 శాతం పడిపోయి 160.98 డాలర్లకు చేరుకుంది.
ఈ భారీ పతనంతో అమెరికాలోనే అత్యంత విలువైన కంపెనీగా ఉన్న ఎన్విడియా తన అగ్రస్థానాన్ని కోల్పోగా, ఆ స్థానంలోకి యాపిల్ సంస్థ వచ్చి చేరింది. రాజీనామా దెబ్బకు ఎన్విడియాపై ఆధారపడిన దిగ్గజ టెక్ కంపెనీల షేర్లు భారీగా నష్టపోయాయి.
మరోవైపు జెన్సన్ హువాంగ్ సంపద 148 బిలియన్ డాలర్లకు తగ్గిపోయింది. ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్న ఆయన 12వ స్థానానికి పడిపోయారు.
సాధారణ గేమింగ్ చిప్ ల స్థాయి నుంచి ఎన్విడియాను ఏఐ విప్లవానికి వెన్నెముకగా మార్చిన హువాంగ్, కంపెనీలో వారసత్వ ప్రణాళిక లేకుండా సుమారు 60 విభాగాలను నేరుగా తన నియంత్రణలోనే ఉంచుకున్నారు. దీంతో వేరే వ్యక్తి ఆ స్థానంలోకి వచ్చినా, సంస్థను నడపడం అంత ఈజీ కాదు.
అమెరికా ఏఐ రంగంలో ఏర్పడిన ఈ అస్థిరత పరోక్షంగా చైనాకు లాభం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
