Advertisement

Advertisement


Home > Politics - National

ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయల శాంటా

ప్రపంచంలోనే అతిపెద్ద ఉల్లిపాయల శాంటా

సుదర్శన్ పట్నాయక్.. ఈ వ్యక్తికి పరిచయం అక్కర్లేదు. ఇసుకతో చేసే సైకత శిల్పాలతో ఆయన ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు కిస్మస్ సందర్భంగా మరో సైకత శిల్పం తయారుచేశారు. దాన్ని ఉల్లిపాయలతో అలంకరించారు.

క్రిస్మస్ సందర్భంగా వంద అడుగుల పొడవైన సైకత శాంటా క్లాజ్ శిల్పాన్ని చెక్కారు సుదర్శన్ పట్నాయక్. దీన్ని 2వేల కిలోల ఉల్లిగడ్డలతో అలంకరించారు. పూరి సముద్రతీరాన 2 టన్నుల ఉల్లితో కొలువుదీరిన ఈ శాంటా, ప్రపంచంలోనే అతిపెద్ద శాంటా క్లాజ్ గా గుర్తింపు పొందింది.

"ఏటా క్రిస్మస్ కు ఏదో ఒకటి కొత్తగా చేయడానికి ప్రయత్నిస్తాను. గతేడాది టమాటాలతో శాంటాను తయారుచేశాను. ఈసారి ఉల్లిగడ్డలతో శాంటాను తయారుచేశాను. పుడమిని కాపాడుకోవాలనే సందేశం ఇవ్వడమే నా ఉద్దేశం. అందుకే మొక్కను బహుమతిగా ఇవ్వండి, పుడమిని పచ్చగా మార్చండి అనే స్లోగన్ కూడా రాశాను."

ఇలా ఉల్లిగడ్డల శాంటా సృష్టి వెనక తన ఉద్దేశాన్ని బయటపెట్టాడు సుదర్శన్ పట్నాయక్. వంద అడుగుల పొడవు, 20 అడుగుల ఎత్తు, 40 అడుగుల వెడల్పు ఉన్న ఈ సైకత-ఉల్లిగడ్డల శాంటాను తయారుచేయడానికి 8 గంటల సమయం పట్టిందంట.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?