Advertisement

Advertisement


Home > Politics - Opinion

చంద్రబాబుని ఒకసారి చూడాలనుంది

చంద్రబాబుని ఒకసారి చూడాలనుంది

ఒక సినిమాలో కామెడీ సీన్. బ్రహ్మానందం అద్దె సూటు వేసుకుని పెళ్లిచూపులకెళ్తాడు. పక్కన అతని ఫ్రెండ్ ఏవీఎస్ కూడా ఉంటాడు. పిల్ల తండ్రి అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్తూ అవసరం లేకపోయినా "ఈ సూటు కూడా వీడిదేనండి" అని కాసేపు, "ఆ సూటు అద్దె సరుకు కాదు" అని కాసేపు పనిగట్టుకుని సూటు గురించే చెప్తుంటాడు ఆ ఫ్రెండ్. అలా పదే పదే సూటు ప్రస్తావన తేవడం వల్ల దాని మీద పిల్ల తండ్రి దృష్టి పడుతుంది. చివరికి "మీరు ఆ సూటు బూటు మీవే అని చెప్పుకున్నా అది అద్దె సరుకని తెలుస్తోంది లేండి" అని అమ్మాయి తండ్రి వాళ్లని వెళ్లగొడతాడు. 

చంద్రబాబు వ్యవహారం కూడా ఆ బ్రహ్మానందం టైపులోనే ఉంది.

హైటెక్ సిటీ తానే మొదలెట్టినట్టు, కట్టినట్టు తెగ బిల్డప్ ఇస్తూ వచ్చాడు. పదే పదే "నేనే..నేనే" అని చెప్పుకోవడం వల్ల అప్పటి వరకు నమ్మిన వాళ్లకి కూడా అనుమానమొచ్చేలా అయ్యింది. దాంతో కొందరు చరిత్రలోకి తొంగి చూసి అసలు విషయం చెప్పారు. ఆ ఘనతని నెదురుమల్లి జనార్దన రెడ్డి నుంచి చంద్రబాబు అద్దెకు తెచ్చుకున్నాడని. కేసీయార్ కూడా ఈ విషయన్ని ప్రెస్మీట్ పెట్టి మరీ చెప్పాడు. 

అలా పక్కనోడి క్రెడిట్ లాగేసుకోవడం ఒక ట్యాలెంటైతే, తనకి బ్యాడ్ నేం తెచ్చే విషయాలని పక్కోడి మీదకి నెట్టేయడం కూడా బాబులో ఉన్న స్పెషల్ ట్యాలెంట్. 

గత నాలుగన్నరేళ్లుగా ఆంధ్రప్రదేశులో మాత్రమే దొరికే బూంబూం బీర్ల గురించి, ఏవో కొన్ని లోకల్ బ్రాండ్ మద్యం గురించి ఎద్దేవా చేస్తూ తెదేపా వాళ్లు కాలక్షేపం చేసారు. 

ఎప్పటినుంచో ఆ బ్రాండ్స్ కి అనుమతులిచ్చింది చంద్రబాబు తప్ప తాము కాదని అసెంబ్లీ సాక్షిగా డెమో ఇచ్చి మరీ జగన్ మోహన్ రెడ్డి చెప్పినా కూడా ఎవ్వరూ బుర్రకెక్కించుకోలేదు.

అందుకే ఇప్పుడు ఆ విషయంపై కేస్ పెట్టించింది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఎందుకంటే కేసు పెడితే తప్ప జనానికి విషయం రీచ్ అవ్వట్లేదు..పచ్చ మీడియా అవ్వనీయట్లేదు. 

స్కిల్ స్కాం గురించి ఇప్పుడు దేశమంతా తెలిసింది. కారణం కోర్ట్ కేసు. అలాగే బూం బూం బ్రాండ్ల ఘనత బాబుది తప్ప జగన్ మోహన్ రెడ్డిది కాదని ఇప్పుడు సత్యం అవగతమవుతోంది.

లిక్కర్ స్కాం అంటూ పురందేశ్వరి చేస్తున్న హడావిడికి ఇది రివెర్స్ కేసన్నమాట. ఈ దెబ్బకి తేనెతుట్టె కదిలి అసలు ఈగలన్నీ బయటికొస్తాయి. ఎంతమంది దగ్గర ఎంత లంచంపుచ్చుకుని చంద్రబాబు ఈ డిస్టిల్లరీలకి అనుమతిలిచ్చాడో ఆ కేసులో చూపిస్తున్నారు. 

మొత్తానికి ఈ విధంగా చంద్రబాబు తప్పులు ఒక్కక్కటీ కోర్టు సాక్షిగా బయట పెడుతున్నాడు జగన్ మోహన్ రెడ్డి. 

చంద్రబాబు పరిస్థితి ఇంత దయనీయంగా ఉంటే మరో పక్క భువనేశ్వరి స్పీచులు, గచ్చిబౌలి సభలో చైతన్య కృష్ణ ఇచ్చిన వార్ణింగులు, లోకేశ్వరి కొడుకు చెప్పిన ఎమోషనల్ డైలాగ్, బండ్ల గనేష్ మెలోడ్రామా కామెడీ..అన్నీ వైకాపా జనాలకి ట్రోలింగ్ వీడియోలు తీసుకోవడానికి పనికొస్తున్నాయి తప్ప మరి దేనికీ కాదు. 

ఆ వీడియోలన్నీ విలేజ్ లెవెల్లో వైరలైపోయి సింపతీ రావడం మాట అటుంచి తెదేపా మీద పూర్తిగా వెగటు పుట్టేలా చేస్తున్నాయి. 

ఏ రోజుకారోజు చంద్రబాబు బెయిల్ కోసం జపం చేస్తున్న వాళ్లకి ఆ శుభవార్త వినిపిస్తుందో లేదో చెప్పలేని పరిస్థితి. ఒకవేళ వినిపించినా కూడా ఏం లాభం. ఎప్పటికప్పుడు లోపలేయడానికి కావాల్సినన్ని కేసులు లైనప్ చేసి పెట్టుకుంది వైకాపా ప్రభుత్వం. ఈ పరిస్థితుల్లో తెదేపా వారు నానా తిప్పలు పడుతుంటే, ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ ఫారిన్ టూరుకెళ్లాడు. పైగా జనసేన-తెదేపా పొత్తు!! ఎక్కడ? కనిపించడంలేదే? 

ఏది ఏమైనా, ఇన్నాళ్లు చంద్రబాబుని చూడక జనానికి బెంగగా ఉంది. కొందరికి ఒక్కసారైనా చూడాలని సరదాగా ఉంది. 

సరదా ఎందుకని అడిగితే, "జైల్లోకెళ్లొచ్చిన చంద్రబాబు ఫేసుని ఒకసారి చూడాలనుంది. కనీసం ఇప్పటికైనా గర్వం అణిగిందో లేదో గమనించాలని ఉంది. ఒక్కసారి జనానికి చూపించి కావాలంటే మళ్లీ లోపలేసుకోమని చెప్పండి", అని బదులిస్తున్నారు. 

ఉఫ్. ఏంటో ఈ సాడిజం! చూస్తుంటే జాలేయట్లేదు!!

- హరగోపాల్ సూరపనేని

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?