రాజ్ తరుణ్ తనకు కావాలంటూ పోలీస్ కంప్లయింట్ ఇచ్చిన లావణ్య, నిన్న రాత్రి ఆత్మహత్యకు యత్నించిన సంగతి తెలిసిందే. పోలీసులు వెంటనే స్పందించి లావణ్య ఇంటికి వెళ్లారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు.
ఓవైపు కేసు నడుస్తుండగా, మరోవైపు లావణ్య సూసైడ్ కు ప్రయత్నించడం సంచలనంగా మారింది. తాజాగా దీనిపై ఆమె స్పందించింది. రాజ్ తరుణ్ తనకు దక్కడనే భయంతోనే ఆత్మహత్యకు యత్నించినట్టు వెల్లడించింది లావణ్య.
“రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా హీరోహీరోయిన్ అయినంతమాత్రాన స్పెషల్ ట్రీట్ మెంట్ ఉంటుందా? వాళ్లను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు. మాల్వీ మల్హోత్రాకు పోలీసులు కనీసం కాల్ కూడా చేయలేదు, ఎందుకు? వాళ్లు కాలర్ ఎగరేసుకొని తిరుగుతున్నారనిపించింది. నాకు న్యాయం జరగడం లేదనిపించింది. రాజ్ తరుణ్ నాకు దక్కడు అనిపించింది. అందుకే ఆత్మహత్యకు యత్నించాను.”
ఈ కేసును నీరుగార్చడానికి రాజ్ తరుణ్ ప్రయత్నించకపోయినా, అతడి పక్కనుండే వ్యక్తులు ప్రయత్నిస్తారంటూ ఆరోపించింది లావణ్య. అవసరమైతే రాజ్ తరుణ్ హైకోర్టుకు వెళ్లి, తనను అరెస్ట్ చేయకుండా వారెంట్ తెచ్చుకుంటాడనే అనుమానాన్ని వ్యక్తం చేసింది.
“రాజ్ తరుణ్ పక్కన ఓ వ్యక్తి ఉన్నాడు. అతడు రాజ్ తరుణ్ కు మాత్రమే మేనేజరా లేక ఇతర ప్రముఖ హీరోలకు కూడా మేనేజరా అనే విషయం నాకు తెలియదు. కేసును తప్పుదోవ పట్టించడానికి రాజ్ ప్రయత్నించకపోయినా, ఆయన పక్కనున్న వాళ్లు ప్రయత్నిస్తారు కదా. నాకు మాత్రం కాల్స్ వస్తున్నాయి. కేసును వెనక్కు తీసుకుంటే 5 కోట్లు ఇస్తామంటున్నారు. వెనక్కు తీసుకోకపోతే నరకం చూపిస్తామంటున్నారు. పెద్దవాళ్లతో పెట్టుకోవద్దంటూ వార్నింగ్స్ ఇస్తున్నారు.”
ఇతర హీరోయిన్లతో రాజ్ తరుణ్ కు ఎఫైర్లు ఉన్నాయనే ఆరోపణపై మరోసారి నిలబడింది లావణ్య. రిద్దికుమార్ తో అతడికి పూర్తిస్థాయిలో ఎఫైర్ ఉందని, అరియానాతో ఉన్న బంధానికి ఏం పేరు పెట్టాలో తనకు తెలియడం లేదని చెప్పుకొచ్చింది.
“అరియానా, రిద్ది కుమార్ తో రాజ్ తరుణ్ కు రిలేషన్ షిప్స్ ఉన్నాయనేది నిజం. కాకపోతే అరియానాది రిలేషన్ షిప్ అని నేను అనను. వాళ్లిద్దరూ మాట్లాడుకున్న కాల్స్ అయితే నా దగ్గరున్నాయి. దానికి ఏం పేరు పెడతారో నాకు తెలీదు. అరియానా, బిగ్ బాస్ కు చెందిన రవితేజ అనే అబ్బాయితో రిలేషన్ షిప్ లో ఉంది. అతడితో రిలేషన్ షిప్ లో ఉంటూ కూడా రాజ్ తరుణ్ తో మాట్లాడింది. దానికి సంబంధించి ఆధారాలు నా దగ్గరున్నాయి. వాళ్ల బంధానికి ఏం పేరు పెడతారో నాకు తెలియదు.”
ఈ వివాదానికి సంబంధించి త్వరలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ను కూడా కలుస్తానని అంటోంది లావణ్య. ఏపీ ఉప-ముఖ్యమంత్రి, హీరో పవన్ కల్యాణ్ ను కూడా కలిసి న్యాయం కోరతానని ఆమె ప్రకటించిన సంగతి తెలిసిందే.