రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. నామినేటెడ్ పదవులు అయినా పొందవచ్చు అని ఆశగా ఎదురుచూస్తున్న తమ్ముళ్ళకు ఇప్పుడు సరికొత్త టెన్షన్ పట్టుకుంది అని అంటున్నారు. టీడీపీ అధినాయకత్వం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అర్హుల జాబితాను ఎంపిక చేస్తామని చెబుతోందని అంటున్నారు.
ఈ మధ్యనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు ఐవీఆర్ఎస్ విధానం ద్వారానే అభ్యర్థుల ఎంపికను చేశారు. ప్రజలకు నేరుగా ఐవీఆర్ఎస్ ద్వారా వివరాలు అందించి ఎవరు ఎమ్మెల్యేగా నిలబడితే బాగుంటుందని సమాచారం సేకరించారు. వారికే ఎమ్మెల్యే టికెట్లు దక్కాయి.
దాంతో సక్సెస్ అయిన ఆ విధానాన్ని మరో మారు అమలు చేయడం ద్వారా పార్టీలో అసంతృప్తి లేకుండా చూసుకోవాలని బాబు భావిస్తున్నారు అని అంటున్నారు. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. పదవులకు అనేక రెట్లు నేతలు ఉన్నారు.
దాంతో ఐవీఆర్ఎస్ విధానం ద్వారా ఫలానా వారికి ఎక్కువ మార్కులు వచ్చాయని పదవులు కట్టబెడితే ఎలాంటి పేచీ పూచీలు ఉండవని బాబు భావిస్తున్నారని అంటున్నారు. అయితే ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సమాచారం ఎంపిక చేస్తే తమకు అవకాశాలు తగ్గిపోతాయేమో అన్న ఆందోళన ఎక్కువ మంది తమ్ముళ్లలో ఉంది అని అంటున్నారు.
సాధారణంగా నామినేటెడ్ పదవులను అధినాయకత్వానికి దగ్గరగా ఉండేవారు, ఎమ్మెల్యేలు మంత్రుల సిఫార్సులతో అందుకుంటారు. ఇపుడు ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అంటే ఎవరికి దక్కుతుందో ఎవరికి లక్కు ఉందో తెలియడం కష్టమని అంటున్నారు.
అయితే నామినేటెడ్ పదవులను ఈసారి తొందరగానే భర్తీ చేస్తే అయిదేళ్లలో ఎక్కువ మందికి అవకాశాలు అందుతాయని అధినాయకత్వం భావిస్తోందని అంటున్నారు. దాంతో ఇప్పటికే నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ బాధ్యులు, ఇంఛార్జులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్లమెంట్ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గ పరిశీలకుల నుంచి ఆశావహులు గురించి వాకబు చేస్తూనే ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సమాచారం అధినాయకత్వం సేకరించనుంది అని అంటున్నారు. దీంతో తమ్ముళ్ళకు ఇది టెన్షన్ పెట్టేదిగానే ఉంది అని అంటున్నారు.