Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

నయనతార ఎక్కడ.?

నయనతార ఎక్కడ.?

'బాబు బంగారం' సినిమా వచ్చేస్తోంది.. సినిమా ప్రమోషన్‌ ఓ మోస్తరుగా సాగుతోంది. హీరో వెంకటేష్‌ మీడియా ముందుకొచ్చి ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. కానీ, హీరోయిన్‌ జాడే కనిపించడంలేదు. ఆమె మీడియా ముందుకు వచ్చే అవకాశాలు దాదాపుగా లేనట్లే. సినిమాలో ఓ సాంగ్‌ చిత్రీకరించాల్సి వుండగా, నయనతార మొండికేసిందంటూ ప్రచారం జరిగిన విషయం విదితమే. ఆ తర్వాత అసలు యూనిట్‌తో నయనతార టచ్‌లో కూడా లేదని తెలుస్తోంది. 

ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ సినిమాకి అయినా ప్రమోషన్‌ జరిగి తీరాల్సిందే. ఆ ప్రమోషన్‌ కోసం సినిమాకి సంబంధించిన ముఖ్యులంతా దిగి రావాల్సిందే. కానీ, నయనతార మాత్రం ప్రమోషన్‌ సంగతి తనకు అనవసరం.. అన్నట్లుగా వ్యవహరిస్తోంది. దర్శకుడు మారుతితో వచ్చిన విభేదాల కారణంగానే నయనతార, సినిమా ప్రమోషన్‌కి దూరంగా వుంటోందన్నది ఓ వాదన. అదే నిజమైతే, వెంకటేష్‌ ఏమీ చిన్న హీరో కాదు. వెంకటేష్‌ని చూసయినా ఆమె ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొనాలి. 

ఈ ఎపిసోడ్‌లో వెంకటేష్‌ కూడా, నయనతారని లైట్‌ తీసుకున్నట్లే కన్పిస్తోంది. ఇంటర్వ్యూల్లో తప్పదు గనుక, నయనతార గురించిన ఏదో అలా అలా స్పందించిన వెంకటేష్‌, అంతకు మించి, ఆమె గురించి గట్టిగా చెబుతున్న దాఖలాలూ లేవు. 'బాబు బంగారం' సినిమా కోసం నయనతారకి బాగానే సమర్పించుకున్నారు. ఎంత సమర్పించుకున్నా, సినిమా ప్రమోషన్‌ కోసం నయనతార సహకరించడంలేదంటే ఏమనుకోవాలి.?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?