Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

టాలీవుడ్ లో సంక్రాంతి సందడి షురూ

టాలీవుడ్ లో సంక్రాంతి సందడి షురూ

ప్రతి సంక్రాంతికి బాక్సాఫీస్ వార్ తప్పనిసరి. వచ్చే ఏడాది సంక్రాంతికి ఇప్పట్నుంచే కౌంట్ డౌన్ మొదలైంది టాలీవుడ్ లో. మహేష్, పవన్ మధ్య ఈసారి పొంగల్ పోటీ ఉండే అవకాశాలున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా, కొరటాల దర్శకత్వంలో మహేష్ చేస్తున్న మూవీ సంక్రాంతినే టార్గెట్ చేశాయి.

ఇంకా పేరు ఫిక్స్ చేయని పవన్ సినిమా సంక్రాంతికి రెడీ అయిపోవడం ఖాయం. ఎటొచ్చి మహేష్ మూవీనే సంక్రాంతికి వస్తుందా అనేది డౌట్. ఎందుకంటే మహేష్ ఇప్పటివరకు సెట్స్ పైకి రానేలేదు. పైగా అతడి సినిమాలు కాస్త ఆలస్యంగా షూటింగ్ జరుపుకుంటాయనే విషయం అందరికీ తెలిసిందే.

ఒకవేళ మహేష్, పవన్ సినిమాలు సంక్రాంతికి వస్తే కనుక మరో మూవీకి థియేటర్లలో ఛాన్స్ ఉండకపోవచ్చు. ఇప్పటికే చిరంజీవి 151వ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నట్టు అయింది. ఎందుకంటే చరిత్రకు సంబంధించిన కథతో వస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో స్టార్ట్ చేస్తే, జనవరికి రిలీజ్ కావడం కష్టమైన పని.

వస్తే బాలయ్య సినిమానే మరోసారి సంక్రాంతి రేసులోకి వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే త్వరలోనే కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా స్టార్ట్ చేయబోతున్నాడు బాలయ్య. ఆ మూవీ సంక్రాంతికి రెడీ అయ్యే అవకాశాలున్నాయి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?