మెగా హీరో కోసం వెనక్కెళ్తాడా?

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మొదటి సినిమా రిలీజ్‌కి సర్వం సిద్ధమవుతోంది. ముకుంద సినిమాకి నేటితో గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. డిసెంబర్‌ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ…

మెగా హీరో వరుణ్‌ తేజ్‌ మొదటి సినిమా రిలీజ్‌కి సర్వం సిద్ధమవుతోంది. ముకుంద సినిమాకి నేటితో గుమ్మడికాయ కొట్టేస్తున్నారు. డిసెంబర్‌ 24న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. అయితే ఈ చిత్రానికి పోటీగా వస్తోన్న ‘చిన్నదాన నీకోసం’ విషయంలో ‘ముకుంద’ టీమ్‌కి కాస్త టెన్షన్‌గా ఉంది. 

‘చిన్నదాన నీ కోసం’ కూడా ఇదే జోనర్‌ సినిమా కావడం, నితిన్‌ ఎస్టాబ్లిష్డ్‌ హీరో అవడం వల్ల ‘ముకుంద’ ఓపెనింగ్స్‌పై దాని ప్రభావం ఉండొచ్చునని అంచనా. చిన్నదాన నీ కోసం చిత్రాన్ని డిసెంబర్‌ 25న విడుదల చేయాలని నిర్ణయించడంతో ఇరు చిత్రాల నిర్మాతల నడుమ చర్చలు జరుగుతున్నాయట. ఇరు వర్గాలు ఒక అండర్‌స్టాండింగ్‌కి వస్తే ‘చిన్నదాన నీ కోసం’ రిలీజ్‌ వారం వాయిదా పడే అవకాశముందని అనుకుంటున్నారు. 

అయితే జనవరి 1న విడుదల చేయడం వల్ల ‘చిన్నదాన నీకోసం’ అటు క్రిస్మస్‌ హాలిడేస్‌ పీరియడ్‌ని, ఇటు సంక్రాంతిని కూడా క్యాష్‌ చేసుకోవడం కష్టమవుతుంది. మరి అంతటి రిస్క్‌కి ఈ చిత్ర బృందం ఓకే అంటుందా లేదా అనేది ఒకట్రెండు రోజుల్లో తేలిపోతుంది.