ఇద్దరూ తగ్గట్లేదు

ముకుంద..చినదాన నీకోసం..2014 టాలీవుడ్ సినిమాల జాబితాకు ముగింపు పలికే సినిమాలు.  ఒకటి 25 రెండవది 24 విడుదలకు రెడీ అయిపోతున్నాయి. ఒకరైనా వెనక్కో, ముందుకో వెళ్తారనుకుంటే, అలా జరిగేలా కనిపించడం లేదు. నిజానికి చినదాన…

ముకుంద..చినదాన నీకోసం..2014 టాలీవుడ్ సినిమాల జాబితాకు ముగింపు పలికే సినిమాలు.  ఒకటి 25 రెండవది 24 విడుదలకు రెడీ అయిపోతున్నాయి. ఒకరైనా వెనక్కో, ముందుకో వెళ్తారనుకుంటే, అలా జరిగేలా కనిపించడం లేదు. నిజానికి చినదాన నీకోసం 19న విడుదల కావాల్సి వుంది. కానీ లింగా వస్తుందని తెలిసి, దానికి ఓ వారం దూరంగా వుండడమే మంచిదని 25కు వచ్చింది. 

పండుగకు రావాలనుకుని,. గోపాల గోపాల వస్తోంది..ఫ్యామిలీ హీరోల మధ్య పోటీ ఎందుకని, ఓ మూడు వారాలు ముందుగానే డిసైడ్ అయిపొయింది ముకుంద. ఇప్పుడు ఈ రెండు సినిమాలకు పోటీ తప్పడం లేదు. కరుణాకరన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీలు తీస్తారు. కానీ అంతా ఎసి డిసి వ్యవహారం. అయితే హిట్ లేకుంటే ఫట్. ఆయన ట్రాక్ రికార్డు అది. అయితే కొంతకాలంగా నితిన్ తన సినిమాల మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు కాబట్టి, ధైర్యంగా వుండొచ్చు.

ఇక కృష్ణవంశీలా ఫ్యామిలీ క్లాస్ సినిమాలు తీస్తాడని ప్రూవ్ చేసుకున్నాడు శ్రీకాంత్ అడ్డాల. నాగబాబు కొడుకు వరుణ్ తేజ డెబ్యూ మూవీ కావడం సినిమాకు ఓ అట్రాక్షన్. కానీ మెగా హీరోలకు క్లాస్ సినిమాలు అచ్చిరావు. చిరంజీవి నుంచి ప్రూవ్ అవుతున్న వ్యవహారం ఇది. వారికి మాస్ సినిమాలే ఎలా వున్నా కూడా ఆడేస్తాయి. మరి ఈ సినిమా ఎలా వుంటుందో చూడాలి. అయితే 25 నుంచి జనవరి 14వరకు మధ్యలో మరే సినిమాలు వుండే అవకాశం కనిపించడం లేదు. అందువల్ల ఇద్దరూ సేఫ్ అవుతారనే అనుకోవాలి.