జనవరి, ఫిబ్రవరి సీజన్లో ఏ సినిమా వస్తుందో, రాదో తెలియడం లేదు. సినిమాల డేట్లు అన్నీ అయోమయంలో పడ్టాయి.తొమ్మిదికి వస్తుందనుకున్న ఎన్టీఆర్-పూరి టెంపర్ వాయిదా దాదాపు ఖరారైపోయింది. ఆ సినిమా ఫిబ్రవరిలో రావాలనుకుంటోంది.
ఫిబ్రవరి లో వస్తుందనుకున్న త్రివిక్రమ్-బన్నీ సినిమా ఫిబ్రవరి అనుకున్నది మార్చికి వెళ్లిపోయింది. మార్చి 28 అని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇంతవరకు ఐ సంగతి ఏమీ తెలియడం లేదు. సంక్రాంతికి రాదేమో అనుకుంటున్నారు కానీ, వచ్చి తీరుతుందని సినీ వర్గాల బోగట్టా. ఎందుకంటే తమిళనాట ఈ సినిమా కోసం స్క్రీన్ల బుకింగ్ ప్రారంభమైందని వినికిడి. ఒకసారి బుక్ చేసి క్యాన్సిల్ చేస్తే అక్కడి నిబంధనల ప్రకారం ఆరునెలల వరకు మళ్లీ బుక్ చేయడం కుదరదట. అందుకని ఐ కచ్చితంగా వస్తుందని అంటున్నారు.
అలాంటి తుపానులో టెంపర్ ను హడావిడిగా చుట్టేసి విడుదల చేయడం కంటే ఫిబ్రవరికి వెళ్లడం బెటర్ అనుకుంటున్నారు నిర్మాత బండ్ల గణేష్.