దిల్ రాజు చేతిలో సత్యమూర్తి కొడుకు

పెద్ద సినిమాలు అంటే నైజాంలో హక్కులకు రెడీ అనేవాడు దిల్ రాజు. ఇదంతా ఒక్కప్పుడు. ఆ మధ్య కాస్త దెబ్బలు తిన్నాక నెమ్మదించారు. ఇటీవల మళ్లీ పుంజుకున్నారు. అంతవరకు కేవలం పంపిణీ చేయడం తప్ప…

పెద్ద సినిమాలు అంటే నైజాంలో హక్కులకు రెడీ అనేవాడు దిల్ రాజు. ఇదంతా ఒక్కప్పుడు. ఆ మధ్య కాస్త దెబ్బలు తిన్నాక నెమ్మదించారు. ఇటీవల మళ్లీ పుంజుకున్నారు. అంతవరకు కేవలం పంపిణీ చేయడం తప్ప కొనే పని పెట్టుకోలేదు. కానీ ఇప్పుడు మళ్లీ మొదలెట్టారు. 

సన్నాఫ్ సత్యమూర్తి నైజాం హక్కులను పదకొండు కోట్లకు పైగానే చెల్లించి తీసుకున్నారు. చిత్రంగా టెంపర్ నైజాం హక్కులు ఎనిమిది కోట్లకు మించి ఎవరూ వద్దంటే, బండ్ల గణేష్ నేరుగా విడుదల చేసుకున్నారు. కిందా మీదా పడితే పది కోట్లు దాటింది. కానీ సన్నాఫ్ సత్యమూర్తి కొనుగోలే పదకొండు కోట్లకు పైగా అంటే ఆ సినిమా పై వున్న క్రేజ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు.