నాగ్ తరువాత సినిమా ఎప్పుడు?

మనం సినిమాతో మాంచి హిట్ కొట్టాడు నాగార్జున. అప్పుడే అర్థమైంది..తన వయసు..తన స్థాయి..తనకు నప్పే పాత్రలకే ఇంక పరిమితం కావాలని. అదే సమయంలో ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.…

మనం సినిమాతో మాంచి హిట్ కొట్టాడు నాగార్జున. అప్పుడే అర్థమైంది..తన వయసు..తన స్థాయి..తనకు నప్పే పాత్రలకే ఇంక పరిమితం కావాలని. అదే సమయంలో ఎన్టీఆర్ తో కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వాటిని నాగ్ ధృవీకరించాడు కూడా. అయితే ఆ ప్రాజెక్ట్ మరి ఏమయిందో చూడాలి. 

ఎందుకంటే ఇప్పుడు ఎన్టీఆర్ కొత్తగా పూరి ప్రాజెక్ట్ ముందు టేకప్ చేసాడు. అందువల్ల మరో ఆరునెలల వరకు ఇంకో సినిమావుండదు. మరి నాగ్ దగ్గర కూడా కొత్త కమిట్ మెంట్ లు ఏవీ లేవు. నాగచైతన్య వ్యవహారాలు పెద్దగా చూడక్కరలేదు. ఎందుకంటే చైతన్య అన్నీ తాను చూసుకోగలుగుతున్నాడు. 

తాజా సినిమా ప్రొడక్షన్ కూడా చైతూయే చూసుకుంటున్నాడు. మాటీవీ ఎవరు కోటీశ్వరుడు తరువాతి సీజన్ కు ఇంకా టైమ్ వుంది. మరి ఆ లోపల నాగ్ ఏమైనా ప్రాజెక్టు అందుకుంటాడా లేక, అఖిల్ లాంచింగ్ ఏర్పాట్లపై దృష్టి పెడతాడా అన్నది చూడాలి.