మూడు భాషలు..రెండు కోట్లు

ఈ తరం తారలు చాలా తెలివైన వాళ్లు. నిర్మాత అడిగాడు..కాల్ షీట్లు ఇచ్చేద్దాం అనే టైపు కాదు. సినిమా ఏంటి..బిజినెస్ ఎంత..మనకెంత కావాలి..అన్నీ లెక్కలు క్షణాల్లో కట్టేసి ఓ ఫిగర్ చెప్పేయగలరు. ఇప్పుడు నిత్య…

ఈ తరం తారలు చాలా తెలివైన వాళ్లు. నిర్మాత అడిగాడు..కాల్ షీట్లు ఇచ్చేద్దాం అనే టైపు కాదు. సినిమా ఏంటి..బిజినెస్ ఎంత..మనకెంత కావాలి..అన్నీ లెక్కలు క్షణాల్లో కట్టేసి ఓ ఫిగర్ చెప్పేయగలరు. ఇప్పుడు నిత్య మీనన్ అలాంటి షాకే ఇచ్చింది నిర్మాత త్యాగరాజన్ కు. ఆయన..హిందీ హిట్ క్వీన్ సినిమాను దక్షిణాది భాషల్లో రీమేక్ చేయాలనుకున్నారు.

 తమిళ, తెలుగు, మళయాల భాషల జనాలకు పరిచయమైన నటి కోసం గాలించాడు. ఒక్క నిత్య తప్ప ఎవరున్నారు అలాంటి బాపతు. అందకే ఆమెనే అడిగాడు. మూడు భాషల్లో సినిమా..తాను తప్ప మరో ఆప్షన్ లేదు..అంతే రెండు కోట్లు ఇస్తే ఓకె అందిట. ఒక భాషలో కొటి…మూడింటికి మూడు కోట్లు..కొటి డిస్కౌంట్ అన్న రీతిగా. 

కానీ నిర్మాత కాస్త ఖంగుతిని..ఇప్పటికీ ఖరారు చేసుకోలేకపోతున్నాడు. అయినా నిత్య లాంటి లక్కీ గర్ల్ కావాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి మరి.