నాగ్ ఇంటర్వూ..డ్యాన్స్

మేము సైతం కార్యక్రమానికి మెల మెల్లగా పెద్ద హీరోలు రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు బన్నీ, సాయిధరమ్ తేజ రిహార్సల్ ప్రారంభించారు. దర్శకుడు మారుతి కూడా వీళ్లతో జతకలిసాడు. చిరు తన వంతు చిన్న స్కిట్…

మేము సైతం కార్యక్రమానికి మెల మెల్లగా పెద్ద హీరోలు రంగంలోకి దిగుతున్నారు. ఈరోజు బన్నీ, సాయిధరమ్ తేజ రిహార్సల్ ప్రారంభించారు. దర్శకుడు మారుతి కూడా వీళ్లతో జతకలిసాడు. చిరు తన వంతు చిన్న స్కిట్ చేసే యత్నంలో వున్నారు. 

బ్రహ్మానందం కూడా ఏం చేయాలన్నది తనకు వదిలేయమని, తన టైమ్ తాను చేస్తానని మాట ఇచ్చేసాడు. నాగ్ 'మీలో ఎవరు కోటీశ్వరుడు' టైపు కొన్ని రియల్ ఇంటర్వూలు, అలాగే చివరన గ్రూప్ సాంగ్ లో నాలుగు స్టెప్ లు వేస్తారని వినికిడి. ఇలా ఎవరికి తోచినవి వారుచేస్తున్నారు. 

అయితే ఇదంతా లైవ్ వుంటుందా, అంటే అనుమానమే.కొంత లైవ్, కొంత రికార్డింగ్ వుంటుందని వినికిడి. వీలయినంతవరకు లైవ్ చేసి, పెద్ద హీరోలవి రికార్డు చేసి, రెండూ కలపి ప్రదర్శించే ఏర్పాట్లు చేస్తున్నారు.