మేడమ్‌ బాగా నలిగిపోతోందట

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఉన్న డిమాండ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. కరెంట్‌ తీగ చిత్రం తన సక్సెస్‌ రన్‌కి  బ్రేక్‌ వేసినా కానీ రకుల్‌కి ఆ సెట్‌బ్యాక్‌తో పెద్ద లాస్‌ ఏమీ జరగలేదు. తన చేతిలో…

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి ఉన్న డిమాండ్‌ రోజురోజుకీ పెరిగిపోతోంది. కరెంట్‌ తీగ చిత్రం తన సక్సెస్‌ రన్‌కి  బ్రేక్‌ వేసినా కానీ రకుల్‌కి ఆ సెట్‌బ్యాక్‌తో పెద్ద లాస్‌ ఏమీ జరగలేదు. తన చేతిలో ఇప్పుడు అరడజనుకి పైగా చిత్రాలున్నాయి. కిక్‌ 2లో నటిస్తూ నెక్స్‌ట్‌ లెవల్‌కి చేరుకోవడానికి సిద్ధంగా ఉంది. 

అయితే అవకాశాలు లేకపోయినా… అవసరానికి మించి వచ్చి పడిపోయినా కానీ ఇబ్బందే. రకుల్‌కి ఇప్పుడు మరీ ఎక్కువ ఆఫర్లు వచ్చేయడంతో ఆమె అన్ని సినిమాలకి డేట్స్‌ సర్దుబాటు చేయలేక సమస్యలు ఎదుర్కొంటోంది. రెండు, మూడు సినిమాలు ఒకేసారి షూటింగ్‌లో ఉన్నట్టయితే డేట్స్‌ అడ్జస్ట్‌ చేయడం అంత ఈజీ కాదు మరి. 

ఇన్ని సినిమాల మధ్య తిరుగుతూ.. షూటింగుల కోసం వేర్వేరు ప్రదేశాలకి మారుతూ రకుల్‌ బాగా నలిగిపోతోందట. అయితే ఎవరో ఒకరిద్దరు అదృష్టవంతులకి తప్ప ఇంత బిజీగా ఉండే ఛాన్స్‌ ఉండదు కాబట్టి ఈ ప్రెజర్‌ని కూడా ఎంజాయ్‌ చేస్తోందట. అన్ని సినిమాలకి డేట్స్‌ ఇవ్వడం కోసం నిద్ర మానుకుని తన గ్లామర్‌ పాడు చేసుకోనంత వరకు ఓకే… ఏమంటారు?