హీరోలు, దర్శకులు పారితోషికం తగ్గించుకుంటే తప్ప పని జరగదని.. ఖర్చు తగ్గిస్తే తప్ప సినిమా వ్యాపారం నిలబడదని విశ్లేషణలు వెలువడుతోన్న నేపథ్యంలో ముందుగా స్పందించి పూరి జగన్నాథ్, ఎన్టీఆర్ తమ పారితోషికం తగ్గించుకున్నారు. ముందుగా చేసుకున్న ఒప్పందం కంటే చాలా తక్కువకే చేయడానికి అంగీకరించారు.
ఫైనల్‌గా వీరికి ఒక ఫిక్స్డ్ రెమ్యూనరేషన్ అని కాకుండా ఇద్దరికీ చెరో మేజర్ ఏరియాని ఇచ్చేసి నిర్మాణంలో భాగస్వాములని చేసేసాడు బండ్ల గణేష్. నైజామ్ ఏరియాకి ఎంత వస్తే అంత ఎన్టీఆర్‌కి, సీడెడ్ ఎంత పలికితే అంత జగన్‌కి ఇవ్వడానికి సరేనన్నాడు. ఈ రెండు ఏరియాలకి జరిగే మినిమమ్ బిజినెస్ పరిగణనలోకి తీసుకుంటే ఇది ఇద్దరికీ మంచి డీలే.
రెండు ఏరియాలకి కలిపి తక్కువలో తక్కువ పదిహేడు కోట్లు వస్తాయి. సో… ఉత్తరాంధ్ర, ఆంధ్ర, కర్నాటకతో పాటు శాటిలైట్, డివిడి రైట్లు వగైరా వాటిపైనే సినిమా నిర్మాణ వ్యయం రాబట్టుకుని గణేష్ లాభం చూడాలన్నమాట. ఈ పద్ధతిలో కనుక నిర్మాత, బయ్యర్లు అందరూ సక్సెస్ చవిచూసినట్టయితే మిగిలిన వారు కూడా ఇదే పద్ధతి ఫాలో అయ్యే అవకాశాలున్నాయి.