వ్యాపారంలో ఎంత రాణించినా, ఎన్ని కోట్లు గడించినా సచిన్ జోషి సరదా మాత్రం సినిమాలపైనే. అందుకే ఎవరో ఒకర్ని పట్టుకుని సినిమాలు తీయిస్తూనే వుంటాడు. ఆ మధ్య బండ్ల గణేష్ అయ్యాడు..ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ. తరువాత మరోటి కూడా ప్లాన్ చేస్తున్నాడట.
Advertisement
భీమిలి కబడ్డీ జట్టు వంటి రీమేక్ ను డైరక్ట్ చేసిన తాతినేని దర్శకత్వంలో ఈ సినిమా వుంటుందట. మరి దీనికి బినామీ నిర్మాత ఎవరో? కానీ ఒకటి మెచ్చుకోవాలి..సచిన్ కు సినిమాలంటే వున్న పిచ్చి ప్రేమకు. దాంతోనే కోట్ల రూపాయిలు అలా జల్లేస్తున్నాడు.