బాలీవుడ్‌ స్టైల్‌ బూతు చిత్రంలో మంచునాయిక!

మంచు వారి నాయిక అనగానే కుర్రతరం హీరోయిన్లు తాప్సీ, హన్సిక తదితరుల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే సరిపోదు. మంచు వారి ఫ్యామిలీ ప్యాకేజీ చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మంచు మోహన్‌బాబు సరసన చేసిన బాలీవుడ్‌…

మంచు వారి నాయిక అనగానే కుర్రతరం హీరోయిన్లు తాప్సీ, హన్సిక తదితరుల్ని జ్ఞప్తికి తెచ్చుకుంటే సరిపోదు. మంచు వారి ఫ్యామిలీ ప్యాకేజీ చిత్రం ‘పాండవులు పాండవులు తుమ్మెద’లో మంచు మోహన్‌బాబు సరసన చేసిన బాలీవుడ్‌ వెటరన్‌ శృంగార నాయిక రవీనాటాండన్‌ ఎంత సందడి చేసిందో అందరికీ తెలుసు. ఒకప్పట్లో ‘ఎన్నెట్లో చాపేసీ.. ఎన్నిచ్చీ కూకుంటా…’ అంటూ బంగారుబుల్లోడితో కలిసి రవీనా టాండన్‌ తెలుగు వెండితెరమీద విచ్చలవిడిగా ఆరబోసిన అందాలు కూడా ప్రేక్షకులకు గుర్తుండే ఉంటాయి. ఇటీవలి కాలంలో పాం.పాం.తు. లో తప్ప.. పెద్దగా కనిపించని ఈ టాండన్‌.. తాజాగా ఓ హిందీ చిత్రం చేయబోతోంది. 

బాలీవుడ్‌కు మాత్రమే ప్రత్యేకమైన ఒక రకపు ఎబ్బెట్టు శృంగారం… సెమి బూతు చిత్రంగా ఒనిర్‌ అనే దర్శకుడు షాబ్‌ అనే చిత్రాన్ని రూపొందించబోతున్నాడుట. ఇందులో తొలుత అజారుద్దీన్‌ శ్రీమతి సంగీతా బిజ్లానీ ని అనుకున్నారట. అయితే శృంగారం శృతిమించుతున్నదని.. ఆమె ఆఫర్‌ను తిరస్కరించింది. అది కాస్తా తన తలుపు తట్టడంతో ఖాళీగానే ఉన్న వెటరన్‌ భామ రవీనా టాండన్‌ ఎగిరి గంతేసి అందుకుంది. ముద్దు హాట్‌ సీన్లు పుష్కలంగా ఉన్న ఈ చిత్రంలో ఒకనాటి మెరుపు తీగ ఇప్పుడు ఎలాంటి చమక్కులు చూపిస్తుందోనని అంటున్నారు. సంజయ్‌ సూరి కీలకపాత్రను పోషించే ఈ చిత్రంలో రవీనా టాండన్‌ అందాలు మరోసారి ప్రేక్షకులకు కిర్రెక్కిస్తాయనడంలో సందేహం లేదని అంటున్నాయి బాలీవుడ్‌ వర్గాలు.