చిత్రసీమ మరోసారి కలవరపాటుకు గురైంది. మూవీమొఘల్ డి.రామానాయుడు దూరమైన బాధ నుంచి ఇంకా తేరుకోకముందే చంద్రమోహన్ అనారోగ్యం వార్త.. కలచి వేసింది. చంద్రమోహన్‌కి ఏమంది? క్షేమంగా ఉన్నారా? లేదా?? అనే ఆందోళన మొదలైంది. వాళ్లందరికీ ఇది ఊరట కలిగించే వార్త.
చంద్రమోహన్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యపరిస్థితి అదుపులోనే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ప్రముఖ నటుడు చంద్రమోహన్‌కి గుండెపోటు వచ్చిన నేపథ్యంలో ఆయన్ని హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందిస్తున్నారు.
ఆయన వెంటిలేటర్‌పై ఉన్నారని, ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలందాయి. అయితే ప్రస్తుతం ఆయన క్షేమంగానే ఉన్నారని తెలిసింది. రెండు రోజులు అబ్వర్వేషన్‌లో ఉంచి ఆయన్ని ఇంటికి పంపిస్తామని వైద్యులు తెలిపారు.