వెంకట కృష్ణ సాయికి ‘శతప్రతిష్టపనాచార్య’ బిరుదు!

మా నాన్న శ్రీ  వెంకట కృష్ణ సాయి స్వర్ణ గారికి అమెరికాలోని మెంఫిస్ శ్రీ వెంకటేశ్వర ఆలయం బోర్డు అఫ్ ట్రస్టీస్ “శతప్రతిష్టపనాచార్య” బిరుదు ప్రదానం చేసారు అని చెప్పింది టేన్నీస్సీ రాష్ట్రంలోని జర్మన్…

మా నాన్న శ్రీ  వెంకట కృష్ణ సాయి స్వర్ణ గారికి అమెరికాలోని మెంఫిస్ శ్రీ వెంకటేశ్వర ఆలయం బోర్డు అఫ్ ట్రస్టీస్ “శతప్రతిష్టపనాచార్య” బిరుదు ప్రదానం చేసారు అని చెప్పింది టేన్నీస్సీ రాష్ట్రంలోని జర్మన్ టౌన్ పట్టణంలోని హౌస్టన్ హై స్కూల్ లో తొమ్మిదవ తరగతి చదువుతున్న కుమారి సంహిత స్వర్ణ. 

శ్రీ కృష్ణ సాయి గత 18 సంవత్సరాలుగా ఇండియా కల్చరల్ సెంటర్ అండ్ టెంపుల్ (ఐ సి సి టీ) ప్రధాన శైవగామ అర్చకుల పనిచేస్తూ అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లోని హిందూ ఆలయాల్లో వందకు పైగా విగ్రహ ప్రతిష్టాపనలు చేసి రికార్డు సృష్టించారు. ఏప్రిల్ 29 నుండి మే 3 వరకు వందకు పైగా హోమకున్దాలతో, వందకు పైగా ఆగమపందితులు సహకారంతో సతరుద్రీయ యాగాన్ని సమర్ధంగా నిర్వహించారు. 

హవాయి హిందూ ఆలయ స్వామీజీ శ్రీ శ్రీ శ్రీ భోదినాథ వీలన్స్వామి ఆధ్వర్యంలో మే 2న  జరిగిన అభినందన కార్యక్రమంలో స్వామీజీ శ్రీ కృష్ణ సాయికి “శతప్రతిష్టపనాచార్య” బిరుదు ప్రదానం చేసారు. ఆలయ చైర్మన్ డాక్టర్ శ్రీమతి విజయలక్ష్మి మరియు ట్రస్టీ మెంబెర్ శ్రీ ప్రసాద్ దుగ్గిరాల ఈ సందర్భంగా శ్రీ కృష్ణ సాయిని మరియు శ్రీమతి శిరీష స్వర్ణ ని పట్టు సాలువాలతో మరియు నూతన వస్త్రాలతో సత్కారించారు. 

శ్రీ వెంత్కటేశ్వర ఆలయ ప్రధానార్చకులు శ్రీ సత్యనారాయనాచార్యులు నారాయణం దంపతుల్ని స్వామి వారి విశేష ప్రసాదలతో ఆశీర్వదించారు. వ్యవస్థాపకులు డాక్టర్ రమణ వాసిలి ఈ కార్యక్రమ్మాన్ని నిర్వహించారు.