చరణ్‌కి ఎదురెళ్ళేదెవరు?

తన ప్రతి సినిమాని మంచి సీజన్‌లో రిలీజ్‌ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు రామ్‌ చరణ్‌. రిలీజ్‌ టైమింగ్‌ విషయంలో చరణ్‌కి ఉన్న విజన్‌ మిగతావారికి తక్కువేనని ఒప్పుకోవాలి. తన కొత్త సినిమాని కూడా దసరాకి…

తన ప్రతి సినిమాని మంచి సీజన్‌లో రిలీజ్‌ చేయడం అలవాటుగా మార్చుకున్నాడు రామ్‌ చరణ్‌. రిలీజ్‌ టైమింగ్‌ విషయంలో చరణ్‌కి ఉన్న విజన్‌ మిగతావారికి తక్కువేనని ఒప్పుకోవాలి. తన కొత్త సినిమాని కూడా దసరాకి సరిగ్గా వారం ముందు రిలీజ్‌ చేయాలని చరణ్‌ నిర్ణయించుకున్నాడు.     

అక్టోబర్‌ 15న చరణ్‌, శ్రీను వైట్ల చిత్రం రిలీజ్‌ అవుతుందని ఆల్రెడీ ప్రకటించారు. దసరా సీజన్‌లో మేం వస్తున్నాం… మిగిలినవాళ్లు దానికి అనుగుణంగా ప్లాన్‌ చేసుకోండని ఇలా డేట్‌ని ఇప్పుడే ప్రకటించి దసరా సీజన్‌పై కర్చీఫ్‌ వేసి ఉంచారన్నమాట. అక్టోబర్‌ 15 అంటే.. అటు దసరా సెలవులతో పాటు కొన్ని పబ్లిక్‌ హాలిడేస్‌ కూడా తొలి పది రోజుల్లో కలిసి వస్తాయి. 

ఈ డేట్‌కి రావడం వల్ల ఏమాత్రం బాగుందన్నా కానీ కలెక్షన్ల ప్రభంజనం ఉంటుంది. అలాగే దసరాకి ప్లాన్‌ చేసిన ఇతర పెద్ద సినిమాలేవీ ప్రస్తుతానికి లేనట్టే. జులై, ఆగస్ట్‌లో రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తోన్న సినిమాల్లో ఏదైనా లేట్‌ అయి దసరాకి షిఫ్ట్‌ అయితే కనుక పోటీ ఎక్స్‌పెక్ట్‌ చేయవచ్చు. లేదంటే ఈ దసరాకి చరణ్‌ సోలోగా ఏలుకుంటాడు.