పవన్‌ రూట్లో ఎన్టీఆర్‌!

అప్పట్లో తన సినిమాలని ప్రమోట్‌ చేసుకోవడానికి ఎన్టీఆర్‌ ఉత్సాహం చూపించేవాడు కానీ గత నాలుగైదేళ్లలో ఎందుకో పూర్తిగా మీడియాకి దూరంగా ఉంటున్నాడు. తన చిత్రాలకి ఆడియో వేడుకలు చేయడం మినహా ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలు లేదా…

అప్పట్లో తన సినిమాలని ప్రమోట్‌ చేసుకోవడానికి ఎన్టీఆర్‌ ఉత్సాహం చూపించేవాడు కానీ గత నాలుగైదేళ్లలో ఎందుకో పూర్తిగా మీడియాకి దూరంగా ఉంటున్నాడు. తన చిత్రాలకి ఆడియో వేడుకలు చేయడం మినహా ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూలు లేదా గ్రూప్‌ ఇంటర్వ్యూలు ఇవ్వడం కానీ మానేసాడు. 

చాలా గ్యాప్‌ తర్వాత ఎన్టీఆర్‌ ఒక రికార్డెడ్‌ ఇంటర్వ్యూని రిలీజ్‌ చేస్తున్నాడు. ఎన్టీఆర్‌ని వక్కంతం వంశీ ఇంటర్వ్యూ చేసిన వీడియో  మీడియాకి ఇవ్వబోతున్నారు. ‘గోపాల గోపాల’, ‘అత్తారింటికి దారేది’ చిత్రాల ప్రమోషన్స్‌కి పవన్‌కళ్యాణ్‌ ఇదే చేసాడు. తన రికార్డెడ్‌ ఇంటర్వ్యూలతో ఆ చిత్రాలకి తన వంతు ప్రచారం చేసేసానని ఫీలయ్యాడు. 

ఇప్పుడు ఎన్టీఆర్‌ కూడా అదే ఫాలో అవుతూ రికార్డెడ్‌ ఇంటర్వ్యూ ద్వారా ‘టెంపర్‌’ విజయానందాన్ని అభిమానులతో షేర్‌ చేసుకోబోతున్నాడు. అయితే మీడియా వాళ్లతో నేరుగా ఇంటరాక్ట్‌ కానంత వరకు ఇలాంటి ఇంటర్వ్యూలు పెద్దగా కిక్‌ ఇవ్వవు. ఒకప్పుడు మీడియాకి అందుబాటులో ఉండడానికే మొగ్గు చూపిన ఎన్టీఆర్‌ ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నాడనేది అతనికే తెలియాలి.