రఘువీరా..అస్తిత్వసమస్య?

వాడు నడవ లేడు..ఎదుటివాడు నడిస్తే చూడలేడు అన్నట్లుంది పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో వ్యవహారం. ప్రత్యేక హోదాపై వైకాపా పార్టీ బంద్ చేస్తే, ఆయన చేసిన రిమార్కులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. Advertisement…

వాడు నడవ లేడు..ఎదుటివాడు నడిస్తే చూడలేడు అన్నట్లుంది పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డితో వ్యవహారం. ప్రత్యేక హోదాపై వైకాపా పార్టీ బంద్ చేస్తే, ఆయన చేసిన రిమార్కులు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.

ప్రతిపక్ష నేతగా జగన్ అన్ ఫిట్ అంట..పైగా ఆయన ప్రతిపక్ష నేత కావడం దురదృష్టకరం అంట..ఇలా ఆయన డిసైడ్ కావడానికి ఆయన చెబుతున్న కారణం ఒక్కటే. బంద్ పిలుపు ఇచ్చి, మిగిలిన పార్టీలకు చెప్పడం లేదా కలుపుకు పోవడం చేయలేదట.

ప్రతిపక్షాలు అంటే పోరాటం అన్నది రఘువీరాకు తెలియదా? ఇటీవల కాంగ్రెస్ పార్టీ కొన్ని పోరాటాలు చేసింది. అందర్నీ కలుపుకునిపోయిందా. వారి పోరాటాలువారివి. అంతమాత్రం చేత రఘువీరా వృధా అయిపోరు కదా?

రఘువీరాకు అయితే భయమన్నా వుండి వుండాలి..జగన్ కు ప్రతిపక్ష నేతగా గుర్తింపు వచ్చేస్తుందనో, హోదాపై కాంగ్రెస్ ది తప్ప అని ప్రజలు అనుకుంటారనో లేదా, ఆశ అయినా  వుండి వుండాలి..జగన్ ను తిడితే తనను గుర్తిస్తారని. జగన్ ను తిడితే రఘువీరాకు వచ్చేది ఒక్కటే, బాబు అనుకూల పత్రికల్లో ఫ్రంట్ పేజీలో వార్త. అంతకు మించి ఒరిగేది ఏమీ వుండదు. ఈ రోజు జరిగింది కూడా అంతే.