మొత్తానికి త్రివిక్రమ్ ప్రకటించేసారు

చాన్నాళ్లుగా వార్తల్లో నానుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా బులిటెన్ బయటకు వచ్చింది. నిజానికి ఈ బులిటెటన్ లో కొత్త విషయాలులేవు. అధికారికంగా చెప్పడం మినహా. త్రివిక్రమ్ =రాధాకృష్ణ కాంబినేషన్ లో నితిన్ హీరోగా…

చాన్నాళ్లుగా వార్తల్లో నానుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కొత్త సినిమా బులిటెన్ బయటకు వచ్చింది. నిజానికి ఈ బులిటెటన్ లో కొత్త విషయాలులేవు. అధికారికంగా చెప్పడం మినహా. త్రివిక్రమ్ =రాధాకృష్ణ కాంబినేషన్ లో నితిన్ హీరోగా ఓ సినిమా చేస్తున్నాడని ఎప్పుడో వార్తలు వచ్చేసాయి.

నాగ్ చైతన్య లేదా నితిన్ అని కిందా మీదా పడి నితిన్ ను ఫైనల్ చేసారు. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లు అన్నీ తెలిసినవే. సమంత హీరోయిన్ అని, రెండో హీరోయిన్ ను ఎంపిక చేయాల్సి వుంది అని.

అలాగే ఈ చిత్రానికి సంగీతం- అనిరుధ్, కెమెరా- నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్-రాజీవన్, ఎడిటింగ్-కోటగిరి వెంకటేశ్వర రావు, సౌండ్ డిజైనర్- విష్ణు గోవింద్, శ్రీ శంకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్- పి,డి.వి.ప్రసాద్ వ్యవహరిస్తారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని సంకల్పించారు. నిజానికి వినాయకచవితి దాటాక ఈ సినిమా విశేషాలు వెల్లడిద్దామనుకున్నారు. కానీ నిర్మాత రాధాకృష్ణ బర్త్ డే రేపు కావడంతో ఈ రోజే ప్రకటించేసారు.