విడుదలకు ముందే టూర్లు

మంచు విష్ణు తన లేటెస్ట్ వెంచర్ డైనమేట్ ను బాగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. అందుకే విడుదల తరువాత విజయ యాత్రల కన్నా ముందే ప్రచార యాత్రలు సాగించాలనుకుంటున్నాడు. గతంలో రౌడీ సినిమా కూ ఇలాగే…

మంచు విష్ణు తన లేటెస్ట్ వెంచర్ డైనమేట్ ను బాగా ప్రమోట్ చేయాలనుకుంటున్నాడు. అందుకే విడుదల తరువాత విజయ యాత్రల కన్నా ముందే ప్రచార యాత్రలు సాగించాలనుకుంటున్నాడు. గతంలో రౌడీ సినిమా కూ ఇలాగే చేసాడు.

మొన్నటికి మొన్న కేరింత సినిమాకు దిల్ రాజు ఇలాగే చేసాడు. కాస్త వర్కవుట్ అయింది. అందుకే విష్ణు, హీరోయిన్, డైరక్టర్ కలిసి, ఆంధ్ర, తెలంగాణ లోని ప్రధాన నగరాలకు వెళ్తారు. అక్కడ మాల్స్, కాలేజీలు, ఇలా వీలైన చోట్ల ప్రేక్షకులను కలుస్తారు. సినిమా గురించి వివరిస్తారు.

బాగనే వుంది. లవ్ స్టోరీ, యూత్ ఫుల్ సినిమా అయితే మాల్స్, ఫ్లాష్ మాబ్ లు, డ్యాన్స్ లకు చాన్స్ వుంటుంది. డైనమేట్ పక్కా థ్రిల్లర్,. మరి దీనికి ఏ విధంగా ప్రచారం చేస్తారో చూడాలి.