మ‌ధురిమ సీన్లు లేపేశారా?

టెంప‌ర్ సెట్లో ఎన్టీఆర్ – మ‌ధురిమ గొడ‌వ‌ప‌డ్డార‌ని గాసిప్పులు వినిపించాయి. అబ్బే అలాంటిదేం లేద‌ని పూరి కూడా స‌ర్దిచెప్పాడు. ఆ రూమ‌ర్ల మాటేమో గానీ.. టెంప‌ర్ ప‌ట్ల మ‌ధురిమ ఇంకా ఇంకా అసంతృప్తిగానే ఉంద‌ట‌.…

టెంప‌ర్ సెట్లో ఎన్టీఆర్ – మ‌ధురిమ గొడ‌వ‌ప‌డ్డార‌ని గాసిప్పులు వినిపించాయి. అబ్బే అలాంటిదేం లేద‌ని పూరి కూడా స‌ర్దిచెప్పాడు. ఆ రూమ‌ర్ల మాటేమో గానీ.. టెంప‌ర్ ప‌ట్ల మ‌ధురిమ ఇంకా ఇంకా అసంతృప్తిగానే ఉంద‌ట‌. దానికి కారణం. త‌న‌కు చెప్పిన పాత్ర ఒక‌టి.. తీసిన సీన్లు ఒక‌ట‌ని ఫీలౌతోంద‌ట‌. 

క‌థ చెప్పేట‌ప్పుడు `నీ పాత్ర అద్భుతం, అమోఘం` అని చెప్పి, చివ‌రకు ఏదో నామ్‌కే వాస్తే అన్నట్టు సీన్లు తీశార‌ట‌. దాంతో మ‌ధురిమ తెగ ఫీలైంద‌ని, అందుకే  సెట్లో గొడ‌వ పెట్టుకొంద‌ని తెలిసింది. అంతేకాదు… ఇప్పుడు `టెంప‌ర్‌` ట్రిమ్మింగ్‌లోనూ బ‌లైపోయింది మ‌ధురిమ సీన్లేన‌ట‌. 

టెంప‌ర్ నిడివి త‌గ్గించాలి అనుకొన్నప్పుడు ఆ క‌త్తిరింపులో మ‌ధురిమ న‌టించిన సీన్లకే ఎక్కువ ఎఫైక్ట్ ప‌డింద‌ట‌. దాంతో మ‌ధురిమ మ‌రింత‌గా రుస‌రుస‌లాడిపోతోంద‌ట‌. ఈ సినిమా ప్రమోష‌న్లలో కూడా పాల్గొనేది లేద‌ని స‌న్నిహితుల‌తో చెబుతోంద‌ట‌. ముందు అలానే అంటారు.. కోంప‌దీసి టెంప‌ర్‌గానీ హిట్టయిపోతే.. ఆ త‌ర‌వాత త‌నే ఎగురుకొంటూ వ‌స్తుంది. చూద్దాం. ఏం జ‌రుగుతుందో…??