సినిమాకు పబ్లిసిటీ కావాలి అది విపరీత పోకడలతో ఉంటే ఇంకా మంచిది. ఎవరి సినిమా వాళ్లకు ముద్దు. ఎన్ని లోపాలున్నా గొప్పగా డప్పాలు కొట్టాలి. అలాంటి దానికి సరైన వేదిక ఆడియో రిలీజ్ ఫంక్షన్ ‘టెంపర్’ సినిమా ఆడియోలో ఫంక్షన్లో బోలెడన్ని విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి.
అభిమానులు చంకలు గుద్దుకుంటే విమర్శకులు వింతగా ఫీలయ్యారు. రాసి పెట్టుకోండి. ఇది నందమూరి తారక నామ సంవత్సరం అని ఎన్‌టిఆర్ ఎంతో కాన్ఫిడెన్స్‌తో చెప్పడం విచిత్రంగా ఉన్నా ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ స్ట్రాంగ్‌గా ఉన్నాయని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది.
ఇక కళ్యాణ్ రామ్ కూడా ‘పటాస్’ హిట్‌తో తన సోదరుడికి ఎంతో బూస్టఫ్ ఇచ్చాడు. పైగా మూడక్షరాలతో ఉన్న టైటిల్స్ హిట్ అనీ పటాస్, టెంపర్, లయన్ చిత్రాలను పేర్కొనడం మరో విచిత్రం. ఇక పూరీ జగన్నాధ్ అయితే ఎన్‌టిఆర్‌కు ‘ఇది మొదటి చిత్రంగా చెప్పుకోవాలి. మీరు అలాగే భావించండి’ అనడం ఇంకో విచిత్రం.
గత కొన్నేళ్లుగా ఎన్‌టిఆర్‌కు హిట్ లేదు. అటు చిరంజీవి ఫ్యామిలీలో నిన్నగాక మొన్న వచ్చిన కుర్రాళ్లు కూడా హిట్ నమోదు చేసుకోవడం, ఎన్ని ఫైట్లు, పంచ్ డైలాగ్స్ కొట్టినా జనం ఎన్టీఆర్‌కి హిట్ ఇవ్వకపోవడం వెరసి ‘టెంపర్’ పబ్లిసిటీని వింత పోకడలతో మొదలుపెట్టారనిసిస్తుంది.
పూరీ జగన్నాధ్‌తో ఎన్‌టిఆర్ గతంలో ‘ఆంధ్రావాలా’లాంటి భారీ ఫ్లాప్ ఇచ్చాడు. ఇప్పుడు అదృష్టం ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.