బుల్లితెరపై చాకులాంటి కుర్రాడు

కత్తిలాంటి అమ్మాయితో చాకులాంటి కుర్రాడు.. అంటూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌. హీరోగా పలు సినిమాల్లో నటించి, ఆనాటి ప్రేక్షకుల్ని అలరలించిన చంద్రమోహన్‌, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. మొన్నామధ్యన అనారోగ్య…

కత్తిలాంటి అమ్మాయితో చాకులాంటి కుర్రాడు.. అంటూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నారు సీనియర్‌ నటుడు చంద్రమోహన్‌. హీరోగా పలు సినిమాల్లో నటించి, ఆనాటి ప్రేక్షకుల్ని అలరలించిన చంద్రమోహన్‌, ప్రస్తుతం క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా స్థిరపడ్డారు. మొన్నామధ్యన అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరుకున్న చంద్రమోహన్‌ ప్రస్తుతం కోలుకున్నారు.

సినీ పరిశ్రమను వరుస మరణాలు ఆందోళనకు గురిచేసిన టైమ్‌లోనే చంద్రమోహన్‌ తీవ్ర అస్వస్థత అన్న న్యూస్‌ తెరపైకొచ్చింది. చాలామంది ఆందోళన చెందారు. అదృష్టవశాత్తూ ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి యాక్టివ్‌గా సినిమాల్లో నటిస్తున్నారు. మొన్నీమధ్యనే టాలీవుడ్‌ నిర్వహించిన ‘మహా మృత్యుంజయ హోమం’లో చంద్రమోహన్‌ పాల్గొని, హోమం జరుగుతున్న తీరు పట్ల, దాన్ని టాలీవుడ్‌ నిర్వహిస్తుండడం పట్ల హర్సం వ్యక్తం చేశారు.

బుల్లితెరపై చంద్రమోహన్‌ ఓ షోలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించిన ప్రోమోస్‌లో చంద్రమోహన్‌, ‘కత్తిలాంటి అమ్మాయితో చాకులాంటి కుర్రాడు..’ అంటూ యాంకర్‌ అనసూయతో కలిసి డైలాగ్‌ దంచేశారు. ఇంత యాక్టివ్‌గా చంద్రమోహన్‌ని చూస్తోన్న ఒకనాటి ఆయన అభిమానులు, చంద్రమోహన్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటున్నారు. చంద్రమోహన్‌ బుల్లితెరపై డాన్సులే చేస్తారో, సెంటిమెంట్‌ పండిరచేస్తారో, మంచి మెసేజే ఇస్తారో వేచి చూడాలి.