అల్లు అర్జున్‌ మూడు ముక్కలాట

ఇద్దరు హీరోయిన్ల సినిమాలే అరుదుగా చేసే అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ మూడు ముక్కలాట ఆడిరచబోతున్నాడు. బన్నీతో త్రివిక్రమ్‌ తీసే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్‌. జనసేన పనులతో బిజీగా ఉండి ఇంతకాలం దీనికి…

ఇద్దరు హీరోయిన్ల సినిమాలే అరుదుగా చేసే అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ మూడు ముక్కలాట ఆడిరచబోతున్నాడు. బన్నీతో త్రివిక్రమ్‌ తీసే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉంటారని టాక్‌. జనసేన పనులతో బిజీగా ఉండి ఇంతకాలం దీనికి కథ పూర్తి చేయలేకపోయిన త్రివిక్రమ్‌ ఇప్పుడు డే అండ్‌ నైట్‌ అదే పనిలో ఉన్నాడు. 

ఈ నెలలోనే ఈ చిత్రాన్ని మొదలు పెట్టేసి అక్టోబర్‌కల్లా షూటింగ్‌ పూర్తి చేసేయాలని త్రివిక్రమ్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. పవన్‌కళ్యాణ్‌తో సన్నిహితంగా ఉంటున్నాడని, ఈ సినిమా కథ మీద వర్క్‌ చేయడం లేదని అల్లు ఫ్యామిలీ త్రివిక్రమ్‌పై అలిగిందని, ఈ సినిమా కాన్సిల్‌ అయిందని పుకార్లు వినిపించాయి. 

కానీ అవేమీ నిజం కాదని ఇప్పుడు తేలిపోయింది. త్రివిక్రమ్‌ ముందుగా అనుకున్నట్టే అల్లు అర్జున్‌తో ఈ సినిమా చేసేస్తున్నాడు. దీనిని వేగంగా పూర్తి చేసి మలి చిత్రాన్ని ప్లాన్‌ చేసుకోవడానికి కూడా అతను తొందర పడుతున్నాడు. ఎన్టీఆర్‌, మహేష్‌ ఇద్దరూ త్రివిక్రమ్‌తో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. వారిలో ఎవరితో ముందు చేస్తాడనేది ఆసక్తి రేకెత్తిస్తోంది.