సినిమాల్లో హీరో లు చెప్పే డైలాగులు తమ అభిమానులకు ఎంత ఉత్సాహాన్ని ఇస్తాయో అందరికీ తెలిసిన విషయమే.! అదే బాలకృష్ణ సినిమాల్లో… బాబు చెప్పే డైలాగుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.! '' నీ ఇంటి కొస్తా.. నీ నట్టింటికొస్తా… '' అంటూ మెదలైన బాలయ్య బాబు ప్యాక్షన్ కం మాస్ డైలాగుల ప్రవాహం.. సినిమా హిట్టూ, ఫట్టూ తో సంబందం లేకుండా… అభిమానులను ఉర్రూతలూగిస్తూనే ఉంటాయి. ఇంతకముందు వచ్చిన “సింహా” సినిమాలో డైలాగులు అయితే ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.! ప్రతీ డైలాగులోనూ బాలయ్య నటవిశ్వరూపం ''దబిడి దిబిడే”.
అయితే తాజా చిత్రం ''లెజెండ్'' లో ప్రత్యేకంగా ఎన్నికల కోసం, పార్టీ జంపింగ్ ల కోసం బాలయ్య చెప్పిన డైలాగులు గురించే ఇప్పుడు చర్చంతా! ఈ చిత్రం క్లైమాక్స్ లో ప్రత్యర్థి పార్టీ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెడతారు లెజెండ్.! వారందరితోనూ మాట్లాడతారు! పార్టీలు మారతామని అంతా చెబుతారు.! అప్పుడు లెజెండ్ తన దైన స్టైలో స్పందిస్తూ… మీ కోసం.. మీ రాజకీయ భవిష్యత్తు కోసం.. మీ వ్యాపారాల కోసం పార్టీలు మారతారే తప్ప… ఏ ఒక్కడైనా… ప్రజల కోసం మారతాము అని చెప్పారా? ఇంతకాలం మీకు ఆశ్రయమిచ్చి… అధికారాలు ఇచ్చి… గుర్తింపు ఇచ్చిన పార్టీని వదిలేస్తారా అంటూ విరుచుకుపడతారు!
ఈ డైలాగు ప్రస్తుత సమయంలో సరిగ్గా సరిపోతుంది కానీ… ఇవ్వన్నీ ఎక్కువగా… కాంగ్రెస్ లో రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసి వ్యక్తిగత ఎజెండాతో… అన్ కండీషనల్ గా టీడీపీలో చెరుతున్న నేతలకు వర్తించేలా ఉన్నాయని సినీ రాజకీయ విమర్శకుల అభిప్రాయం! కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్న చందంగా … ఇతర పార్టీల్లో జంపులుపై విమర్శిద్దాం అనుకుంటే… అటు తిరిగి ఇటు తిరిగి అది మొత్తం తమ పార్టీకే రావడం… బ్యాక్ ఫైర్ కాదంటారా?