చెర్రీ ప్రయోగం చేస్తున్నట్టేనా?

యాక్షన్‌.. యాక్షన్‌… యాక్షన్‌. రామ్‌చ‌ర‌ణ్ బండి ఎప్పుడూ ఈ అంశంపైనే సాగాలి. ఎందుకంటే ఆయ‌న‌కి తొలి సినిమాతోనే మాస్ ఇమేజ్ వ‌చ్చేసింది. తండ్రి చిరంజీవిని చూసిన క‌ళ్లతోనే చ‌ర‌ణ్‌నీ చూస్తారు. ఆ విష‌యం `ఆరెంజ్‌`తోనే…

యాక్షన్‌.. యాక్షన్‌… యాక్షన్‌. రామ్‌చ‌ర‌ణ్ బండి ఎప్పుడూ ఈ అంశంపైనే సాగాలి. ఎందుకంటే ఆయ‌న‌కి తొలి సినిమాతోనే మాస్ ఇమేజ్ వ‌చ్చేసింది. తండ్రి చిరంజీవిని చూసిన క‌ళ్లతోనే చ‌ర‌ణ్‌నీ చూస్తారు. ఆ విష‌యం `ఆరెంజ్‌`తోనే రుజువైంది. స్వత‌హాగా చ‌ర‌ణ్‌కి ప్రయోగాలంటే ఇష్టం. సున్నిత‌మైన క‌థ‌ల్లో న‌టించాల‌నుకొంటుంటాడు. కానీ అలాంటి ప్రయ‌త్నాలు చేస్తే వృథా కావాల్సిందేన‌ని  ఆరెంజ్ నిరూపించింది. 

అందుకే … చ‌ర‌ణ్ చాలా రోజుల వ‌ర‌కు ఆ త‌ప్పు మ‌ళ్లీ చేయ‌లేదు. ఏ సినిమా ఎంచుకొన్నా క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌ని వ‌దిలిపెట్టలేదు. మాస్ అంశాలు ఉండేలా చూసుకొన్నాడు. కానీ సుదీర్ఘకాలం త‌ర్వాత ఇప్పుడాయ‌న మ‌రో ప్రయోగం చేస్తున్నట్టు ఫిల్మ్‌న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. కృష్ణవంశీ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్న సినిమా నిజంగా ఓ ప్రయోగ‌మే అని అంటున్నారు. 

కుటుంబ అనుబంధాలు ద‌ట్టించిన సినిమా ఇది. యాక్షన్ అంశాలు ఉండొచ్చు కానీ… ఫ్యామిలీ ఎమోష‌న్స్ మోతాదే ఎక్కువ అంటున్నారు జ‌నాలు. మ‌రి చ‌ర‌ణ్ చేస్తున్న ఈ ప్రయోగం ఎంత‌వ‌ర‌కు ఫలిస్తుంది? అని విశ్లేష‌కులు లెక్కలేస్తున్నారు. కృష్ణవంశీ మాత్రం ఓ ప్రణాళిక ప్రకారమే ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకెళుతున్నాడ‌ని ఫిల్మ్ న‌గ‌ర్ జ‌నాలు అంటున్నారు. ఇటీవ‌ల ఫ్యామిలీ స‌బ్జెక్స్ట్ ఎక్కువ‌గా ఆద‌ర‌ణ పొందుతున్నాయి కాబ‌ట్టి… ఈ చిత్రం కూడా త‌ప్పకుండా ఫ‌లితాన్నిస్తుంద‌ని ఆయ‌న న‌మ్ముతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పొలాచ్చిలో చిత్రీక‌ర‌ణ జ‌రుపుకొంటోంది.