చరణ్‌తో ఈసారి గ్యారెంటీ

రామ్‌ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలోనే నటించాల్సిన సమంత అప్పుడు తన షెడ్యూల్‌ దెబ్బ తినడం వల్ల ఆ చిత్రానికి అడిగిన డేట్స్‌ ఇవ్వలేకపోయింది. సమంత కోసం చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఆమె…

రామ్‌ చరణ్‌తో ‘ఎవడు’ సినిమాలోనే నటించాల్సిన సమంత అప్పుడు తన షెడ్యూల్‌ దెబ్బ తినడం వల్ల ఆ చిత్రానికి అడిగిన డేట్స్‌ ఇవ్వలేకపోయింది. సమంత కోసం చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఆమె స్థానంలో శృతిహాసన్‌ని తీసుకున్నారు. అలా చరణ్‌తో జత కట్టే ఛాన్స్‌ని, ఇంకో హిట్‌ కొట్టే మూవీని కూడా సమంత మిస్‌ చేసుకుంది. 

పవన్‌, మహేష్‌, ఎన్టీఆర్‌తో నటించేసిన సమంత టాప్‌ 4 హీరోస్‌లో చరణ్‌తో జత కట్టే తరుణమెప్పుడని సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఆ రోజు తొందర్లోనే ఉందట. చరణ్‌ తదుపరి చిత్రంలో సమంత కథానాయికగా నటించడం ఖాయమట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో దుర్గా ఆర్ట్స్‌ సంస్థ కోసం చరణ్‌ ఒక సినిమా చేస్తున్నాడు. 

కృష్ణవంశీతో చేస్తున్న మూవీ తర్వాత వచ్చే ఈ చిత్రంలో చరణ్‌ సరసన సమంత నటిస్తుంది. ఈమధ్య తన ఫోకస్‌ తమిళ చిత్ర సీమపైకి షిఫ్ట్‌ చేసిన సమంత త్వరలోనే మెగా హీరోలు ఇద్దరితో జత కట్టనుంది. చరణ్‌తో ఈ చిత్రం, అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్‌ సినిమాలో సమంత నటించనుంది.