ఎన్నికల తేదీ ఖరారు కావడంతో సినిమా విడుదల షెడ్యూల్స్ కూడా మారుతున్నాయి. ఏప్రిల్ మొదటి రెండు వారాల్లో విడుదల చేద్దామని అనుకున్న పెద్ద సినిమాలు ఇప్పుడు ఎన్నికల తర్వాతకి షిఫ్ట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. లెజెండ్, రేసుగుర్రం, మనం అన్నీ ఒకే టైమ్‌లో విడుదల అవుతాయని వార్తలొచ్చాయి.
కానీ ఎన్నికల తేదీలు ఖరారు అయిపోయేసరికి సదరు నిర్మాతలు కూడా తమ ప్లాన్స్‌లో మార్పులు చేసుకున్నారు. ప్రస్తుతం మార్చి నెలాఖరులో వచ్చే లెజెండ్ తప్ప ఏదీ కన్‌ఫర్మ్ కాలేదు. రేసు గుర్రం మే మూడవ వారంలోనే వస్తుందని అంటున్నారు. మరి మనం చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేస్తారనేది ఇంకా తెలీదు.
ఇప్పటికైతే సమ్మర్‌లో ఫస్ట్ బిగ్ ఫిలింగా లెజెండ్ రావడం ఖరారైంది. దీనికి పోటీగా మరో పెద్ద సినిమా ఏదీ రాకపోవచ్చునని తెలుస్తోంది కాబట్టి కనీసం నెల రోజుల పాటు లెజెండ్ కోసం గ్రౌండ్ ఖాళీగా ఉంటుంది. ఇక బాలకృష్ణ ఏ రేంజ్‌లో బ్యాటింగ్ చేస్తాడో, ఎన్ని కోట్ల కాసులు కురిపిస్తాడో చూడాలి.