చేతులు కాలాక ఆకులు పట్టుకొంటే ఏం లాభం? పడిపోయిన బిల్డింగ్‌కి ఎన్ని మరమత్తులు చేసినా తిరిగి నిలబెట్టగలమా? ఒక్కసారి జనంలో ఫ్లాప్ అనే ముద్ర వేయించుకొన్న సినిమాదీ అదే పరిస్థితి. వన్ సినిమాకి ఇప్పుడు మేకప్ చేయడం మొదలెట్టారు.
నిడివి ఎక్కడ ఎక్కువైంది? ఎక్కడ టెంపో తగ్గింది? అనే విషయంపై తర్జన భర్జనలు పడిన చిత్రబృందం 20 నిమిషాల పాటు కత్తెర్లు వేసి సినిమాని ట్రిమ్ చేశారు. అయినా ఆ ముద్ర చెరపలేం కదా..? ఈలోగా ఎవడు వచ్చేసింది. దిల్ రాజు అదృష్టమో, 14 రీల్స్ దురదృష్టమో తెలీదుగానీ – వన్ నెగిటీవ్ టాక్ ఎవడుకి పూర్తిగా ఫేవర్ అయిపోయింది. వన్ని చూసిన కళ్లతో ఎవడు చూస్తే చాలా బెటర్ సినిమా అనిపించడం ఖాయం.
`1` సినిమాని ఎలా బతికించాలా? అని ఎదురుచూస్తున్న 14 రీల్స్‌కి ఇది షాకింగ్ న్యూసే. ఇంకేం చేస్తే ఈ సినిమాని కాపాడుకోవచ్చు అంటూ దర్శక నిర్మాతలు ఇప్పుడు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనేదో స్ర్కిప్టు దశలో పెట్టుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు కదా..?? మరి వన్ని ఆదుకొనేది ఎవడు? అది ఎవడికి సాధ్యం??