ఉద‌య్‌కిర‌ణ్ స్థితి మ‌రీ అంత బ్యాడా..?

మూడు హిట్లు కొట్టిన హీరో, ల‌క్షల్లో కోట్లలో పారితోషికం తీసుకొన్న హీరో… ఆఖ‌రి రోజుల్లో ఇంటి అద్దె క‌ట్టలేక‌పోయాడంటే న‌మ్మగ‌ల‌రా??  అయితే ఇది అక్షరాలా నిజం. ఉద‌య్‌కిర‌ణ్ దుస్థితికి ఇది నిద‌ర్శనం.  Advertisement ఉద‌య్‌కిర‌ణ్…

మూడు హిట్లు కొట్టిన హీరో, ల‌క్షల్లో కోట్లలో పారితోషికం తీసుకొన్న హీరో… ఆఖ‌రి రోజుల్లో ఇంటి అద్దె క‌ట్టలేక‌పోయాడంటే న‌మ్మగ‌ల‌రా??  అయితే ఇది అక్షరాలా నిజం. ఉద‌య్‌కిర‌ణ్ దుస్థితికి ఇది నిద‌ర్శనం. 

ఉద‌య్‌కిర‌ణ్ ఆత్మహ‌త్య వెనుక గ‌ల కార‌ణాల్లో ఒక‌టి.. ఆర్థిక ఇబ్బందులు. త‌న కొడుక్కి కావ‌ల్సినంత డ‌బ్బుంద‌ని, ఆర్థిక ఇబ్బందులు లేవ‌ని తండ్రి చెబుతున్నా, ఉద‌య్ ప‌రిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. శ్రీ‌న‌గ‌ర్ కాల‌నీలో ఉద‌య్ ఉంటున్న ఫ్లాట్ అద్దె నెల‌కు రూ.30 వేలు. ఈనెల ఇంటి అద్దె కూడా చెల్లించ‌లేని ప‌రిస్థితుల్లో ఉద‌య్‌కిర‌ణ్ ఉన్నాడ‌ని, గ‌త కొన్ని రోజులుగా త‌న భార్య విషిద‌కూ, ఉద‌య్ కిర‌ణ్‌కూ ఈ విష‌య‌మై త‌గువులాట కూడా జ‌రిన‌ట్టు తెలుస్తోంది. 

ఏడాది కాలంగా ఉద‌య్‌కిర‌ణ్ కి సినిమాల్లేవు. ఓ త‌మిళ సినిమా ఒప్పుకొన్నా… ఆ కాంట్రాక్ట్ కొన్ని రోజుల క్రిత‌మే ర‌ద్దు అయ్యింది. భార్య సంపాద‌నే ఆధారం. దాంతో ఉదయ్ కిర‌ణ్‌కీ భార్య విషిద‌కీ మ‌ధ్య పొర‌పొచ్ఛాలు వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. సినిమా వాళ్ల జీవితాలంతే. హిట్టొస్తే పేరు, ప‌ర‌ప‌తి, డ‌బ్బూ అన్నీ వ‌స్తాయి. ఫ్లాపులు ఎదురైతే ఇదీ ప‌రిస్థితి. సో శ్యాడ్ ఉద‌య్ కిర‌ణ్‌.