నాగచైతన్యతో దేవా కట్టా ఏ ముహూర్తాన ‘ఆటోనగర్ సూర్య’ మొదలు పెట్టాడో కానీ ప్రారంభానికి ముందు ఎంతో ప్రకాశవంతంగా కనిపించిన ఈ సూర్యుడు ఇంత వరకు వెలుగు చూడలేదు. ఇదిగో, అదిగో అంటూ కొంత కాలంగా ఈ చిత్రం విడుదల గురించి వార్తలొస్తున్నాయి. చైతన్య బర్త్‌డేకి ట్రెయిలర్ రిలీజ్ చేసి సినిమా వచ్చేస్తోందనే నమ్మకం కలిగించారు.
మిగిలివున్న పాటల చిత్రీకరణ పూర్తి చేసేస్తుంటే, ఇక గ్రహణం వీడినట్టే అనేసుకున్నారు. కానీ డిసెంబర్ అనుకున్న సినిమా జనవరికి వాయిదా పడింది. జనవరి 31న వస్తుందని మీడియాలో వార్తలొచ్చాయి. కానీ మరో ఇరవై రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుందంటే నమ్మలేని పరిస్థితి.
ఇంతవరకు ‘ఆటోనగర్ సూర్య’ ఆడియో రిలీజ్ కాలేదు. ఎప్పుడు విడుదలయ్యేదీ ఇంకా తెలీదు. డిసెంబర్.. జనవరి అయినట్టే, త్వరలో జనవరి.. ఫిబ్రవరి.. ఫిబ్రవరి మార్చి అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తనయుడి సినిమా విడుదలకి తంటాలు పడుతోంటే నాగార్జున సైతం చూస్తూ ఉన్నాడే తప్ప తనే ముందుకొచ్చి దీనికి ఉన్న అవరోధాల్ని తొలగించడం లేదు.. అదేంటో?