పవన్‌ నాట్‌ రీచబుల్‌

‘రేయ్‌’ ఆడియో వేడుకని జనవరి 5న పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో చేయాలని వైవిఎస్‌ చౌదరి ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే ఈ వేడుక వాయిదా పడిందని లేటెస్ట్‌ న్యూస్‌. పవన్‌కళ్యాణ్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వేడుక…

‘రేయ్‌’ ఆడియో వేడుకని జనవరి 5న పవన్‌కళ్యాణ్‌ సమక్షంలో చేయాలని వైవిఎస్‌ చౌదరి ప్లాన్‌ చేసుకున్నాడు. అయితే ఈ వేడుక వాయిదా పడిందని లేటెస్ట్‌ న్యూస్‌. పవన్‌కళ్యాణ్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఈ వేడుక వాయిదా వేసారని తెలిసింది. ఈ చిత్రం రూపొందడానికి అసలు కారణం పవన్‌కళ్యాణ్‌ కనుక ఆడియో వేడుకకి అతను రావాల్సిందేనని వైవిఎస్‌ చౌదరి భావిస్తున్నాడు. 

పవన్‌కళ్యాణ్‌ ఆడియో రిలీజ్‌ చేసిన ఇష్క్‌, నాయక్‌, జులాయి వంటి సినిమాలు బాగా ఆడడంతో అది కూడా ‘రేయ్‌’కి సెంటిమెంట్‌గా కలిసి వస్తుందని చూస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌ వస్తే ‘రేయ్‌’పై మెగా అభిమానులకి ఆసక్తి మరింత పెరుగుతుంది కనుక, అతను లేనిదే ఆడియో రిలీజ్‌ చేయరట. పవన్‌ అందుబాటులో ఉన్నపుడే రేయ్‌ పాటలు రిలీజ్‌ అవుతాయి. 

ఫిబ్రవరి 5న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వైవిఎస్‌ చౌదరి ప్లాన్‌ చేస్తున్నాడు. ఈలోగా ఈ సినిమా ఏ టు జెడ్‌ లుక్‌ అని, ప్రోమో సాంగ్స్‌ అని వరుసగా విడుదల చేస్తూ సినిమాపై హైప్‌ పెంచాలని చూస్తున్నాడు. సాయి ధరమ్‌ తేజ్‌ కూడా మంచి డాన్సర్‌ అని ఇండస్ట్రీ టాక్‌. అతని డాన్సులు మెగా అభిమానుల్ని అలరిస్తాయని, తనని కూడా ‘తమ’ హీరోల జాబితాలో లెక్కించేట్టు చూస్తాయని అంటున్నారు.