ప‌వ‌న్ వ‌స్తున్నాడోచ్‌

మూడో పెళ్లి త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియాకి క‌నిపించ‌లేదు. ఈ విష‌యంలో ప‌వ‌న్ ఏమీ మాట్లాడ‌లేదు కూడా. ప‌వ‌న్ పెళ్లి గురించి గ‌ర‌మ్ గ‌ర‌మ్ చ‌ర్చలు న‌డుస్తున్న ఈ త‌రుణంలో ప‌వ‌న్ ఎదురైతే ఎలా…

మూడో పెళ్లి త‌ర‌వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ మీడియాకి క‌నిపించ‌లేదు. ఈ విష‌యంలో ప‌వ‌న్ ఏమీ మాట్లాడ‌లేదు కూడా. ప‌వ‌న్ పెళ్లి గురించి గ‌ర‌మ్ గ‌ర‌మ్ చ‌ర్చలు న‌డుస్తున్న ఈ త‌రుణంలో ప‌వ‌న్ ఎదురైతే ఎలా ఉంటుంది..??  ఈ పెళ్లి గురించి ఏమైనా స్పందిస్తాడా..??  ఇవ‌న్నీ తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగాలి. 

ఎందుకంటే ప‌వ‌న్ ఓ ఆడియో ఫంక్షన్ కి వ‌చ్చేస్తున్నారు. అదే… రేయ్‌. వైవిఎస్ చౌద‌రి ద‌ర్శక‌త్వం వ‌హించిన చిత్రం రేయ్‌. సాయిధ‌ర‌మ్ తేజ్ క‌థానాయ‌కుడు. ఈ చిత్రంలోని పాట‌ల్ని ఈనెల 5 లేదా 6 వ తేదీల్లో విడుద‌ల చేయ‌బోతున్నారు. 

ఈ కార్యక్రమానికి ప‌వ‌న్ క‌ల్యాణ్ అతిథిగా వ‌స్తాడ‌ట‌. అక్కడ రేయ్ పాట‌ల‌తో పాటు ప‌వ‌న్ పెళ్లి మాట‌లు కూడా వినొచ్చేమో.. గెట్ రెడీ ఫ్యాన్స్.