ఎన్టీఆర్ వాస్తు శాస్త్ర

వ‌రుస ఫ్లాపుల‌తో ఎన్టీఆర్ దిమ్మతిరిగిపోయింది. ఎన్నో అంచ‌నాలు పెంచిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా కూడా మ‌టాషైపోవ‌డంతో ఎన్టీఆర్ తేరుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం త‌న ఫ్లాపుల‌కు కార‌ణాలు వెతుక్కొనే ప‌నిలో ప‌డిపోయాడు. నంద‌మూరి క‌థానాయ‌కుల‌కు సెంటిమెంట్లు ఎక్కువే. ఎన్టీఆర్…

వ‌రుస ఫ్లాపుల‌తో ఎన్టీఆర్ దిమ్మతిరిగిపోయింది. ఎన్నో అంచ‌నాలు పెంచిన రామ‌య్యా వ‌స్తావ‌య్యా కూడా మ‌టాషైపోవ‌డంతో ఎన్టీఆర్ తేరుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం త‌న ఫ్లాపుల‌కు కార‌ణాలు వెతుక్కొనే ప‌నిలో ప‌డిపోయాడు. నంద‌మూరి క‌థానాయ‌కుల‌కు సెంటిమెంట్లు ఎక్కువే. ఎన్టీఆర్ కీ కొన్ని ఉన్నాయి. 

ఈ ప‌రాభ‌వాల‌కు త‌న కొత్త ఇంటి వాస్తు కూడా ఓ కార‌ణ‌మేన‌ని భావిస్తున్నాడు. అందుకే ఇంటి వాస్తు మార్చే ప్రయ‌త్నాల్లో ఉన్నాడు ఎన్టీఆర్‌. జూబ్లీ హిల్స్‌లోని ఎన్టీఆర్ గృహానికి ఇప్పుడు వాస్తు ప్రకారం మ‌ర‌మ‌త్తులు జ‌రుగుతున్నాయి. ఇందుకు సంబంధించిన ప‌నులు గ‌త వారం రోజుల నుంచీ జ‌రుగుతున్నట్టు స‌మాచార‌మ్‌. పూజా మందిరం, ప‌డ‌క గ‌దుల‌ను మారుస్తున్నార‌ట‌. 

వాస్తు శాస్త్రంలో ఆరితేరిపోయిన వాళ్ల స‌ల‌హాలు ఎన్టీఆర్ తీసుకొన్నట్టు తెలిసింది. మ‌రి ఈ వాస్తు శాస్త్ర అయినా ఎన్టీఆర్‌కి విజ‌యాలు తీసుకొస్తుందేమో చూడాలి.