రామ్ కి ద‌ర్శకులు కావాల‌ట‌

వ‌రుస ఫ్లాపుల‌తో బేజారైపోయాడు ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌!  ఒంగోలు గిత్త మంట పుట్టిస్తే… మ‌సాలా ఆ మంట‌ని న‌షాళానికి అంటించింది. ఫైట్లు చించేస్తాడు. కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఎన‌ర్జీలెవిల్స్ అదిరిపోతాయి.. అయినా ఒక్క…

వ‌రుస ఫ్లాపుల‌తో బేజారైపోయాడు ఎన‌ర్జిటిక్ హీరో రామ్‌!  ఒంగోలు గిత్త మంట పుట్టిస్తే… మ‌సాలా ఆ మంట‌ని న‌షాళానికి అంటించింది. ఫైట్లు చించేస్తాడు. కామెడీ టైమింగ్ అద్భుతంగా ఉంటుంది. ఎన‌ర్జీలెవిల్స్ అదిరిపోతాయి.. అయినా ఒక్క హిట్టు కూడా లేదు. ఇప్పుడు అర్జెంటుగా హిట్టు కొట్టి ఫామ్ లోకి వ‌చ్చేద్దాం అనుకొంటున్నాడు. 

దాని కోసం క‌స‌ర‌త్తులు ప్రారంభించేశాడు. త‌న‌కు ఎవ‌రు క‌థ చెప్పినా, కాస్త బాగుంది అనుకొంటే.. క‌థ‌ల్ని కొనేస్తున్నాడ‌ట‌. అలాంటి క‌థ‌లు రామ్ ద‌గ్గర దాదాపు అర‌డ‌జ‌ను వ‌ర‌కూ ఉన్నాయ‌ట‌. అయితే దాన్ని డీల్ చేసే ద‌ర్శకుల కోసం ఎదురుచూస్తున్నాడు. 

రైట‌ర్ గోపీమోహ‌న్ కూడా ఓ క‌థ చెప్పాడ‌ట‌. డైరెక్షన్ ఛాన్స్ కూడా అడిగాడ‌ట‌. అయితే ఈ రైట‌ర్‌.. సినిమాని ఎంత వ‌ర‌కూ డీల్ చేస్తాడా?? అనే సందిగ్థంలో ఉన్నాడు రామ్‌. వీర‌భ‌ద్రమ్ కూడా రామ్ వెంట తిరుగుతున్నాడ‌ని టాక్‌!  మ‌రి రామ్ ఈసారి ఎవ‌రిని న‌మ్ముతాడో?