చౌదరి బ్లాక్‌ అండ్‌ వైట్‌ కాంబినేషన్‌?

భాయ్‌ సినిమా ఫలితంతో డీలా పడకుండా, వెంటనే  మరో సినిమా అది పుచ్చుకున్నాడు వీరభద్రమ్‌. బాగానే వుంది. గోపీచంద్‌ హీరోగా భవ్య క్రియేషన్స్‌ సినిమా. అది కూడా ఓకె. కానీ హీరోయిన్‌ ఎవరన్నదే సమస్య.…

భాయ్‌ సినిమా ఫలితంతో డీలా పడకుండా, వెంటనే  మరో సినిమా అది పుచ్చుకున్నాడు వీరభద్రమ్‌. బాగానే వుంది. గోపీచంద్‌ హీరోగా భవ్య క్రియేషన్స్‌ సినిమా. అది కూడా ఓకె. కానీ హీరోయిన్‌ ఎవరన్నదే సమస్య. గోపీచంద్‌ సరసన అంటే పెద్ద హీరోయిన్లు ప్రస్తుతం వచ్చే పరిస్థితి లేదు. 

కాజల్‌, సమంత వగైరాలు వీర బిజీగా వున్నారు. కొత్తవారిని ట్రయ్‌ చేద్దామంటే సినిమాకు క్రేజ్‌ రాదు. అందుకే వేట సాగుతోంది. ఆఖరికి తమన్నా దగ్గర ఆగింది. ప్రస్తుతానికి తమన్నాకు పెద్దగా చాన్సులేమీ లేవు కనుక ఊ అనడం పెద్ద సమస్య కాదు.

 కానీ, గోపీచంద్‌ కలర్‌ కు, మిల్క్‌ బ్యూటీ తమన్నా కలర్‌ కు మ్యాచ్‌ అవుతుందా? అది కాక తమన్నా సినిమాలు ఎక్కువే కానీ హిట్లు లెక్క పెట్టడానికి ఒక చేతి వేళ్లు కూడా అనవసరం. ఇంకెవరు వున్నారబ్బా?